కొత్త PRC పేరుతో జీతంలో కోతలు

1.IR 27% కంటే తక్కువగా 23% ఫిట్మెంట్ ఇచ్చి 4% కోత ఫలితంగా ఉద్యోగి రవికి తన సర్వీస్ కాలమంతా 2-3 ఇంక్రెమెంట్ల ప్రత్యక్ష నష్టం, పరోక్షంగా నెలకు 600 దాకా DA(20%) నష్టం & HRA(8%) పై 240 నష్టం వాటిల్లనున్నది. 

అనగా ఒక్కో  ఉద్యోగి నికరంగా నెలకు 4000 కోల్పోనున్నాడు. సర్వీస్ పెరిగేకొద్దీ ఈ నష్టం పెరుగుతూనే ఉంటుంది.

2.HRA స్లాబ్ 12/14.5/20/30% ల నుంచి 8/16/24% లకు తగ్గింపు.

ఫలితంగా 

12% HRA లోనివారు 4%,

14.5HRAలోనివారు 6.5%,

20% HRA లోనివారు12%

30% HRA లోనివారు కొందరు 14%, కొందరు 6% HRA ను కోల్పోతున్నారు.

Ex: 60000 basic తీసుకునే  ఉద్యోగులు నెలకు కొందరు 2400(4%loss),

కొందరు 3900(6.5%),

మరికొందరు 7200(12%)

ఇంకొందరు 3600(6%) నష్టపోతున్నారు

ఈ HRA స్లాబులు కూడా 2021 జనాభాగణన ఆధారంగా కాకుండా 2011 నాటి జనాభా ప్రాతిపదికన మాత్రమే అట.

3.సాధారణంగా IR అమలు తేదీ నుంచి PRC మానిటరీ బెనిఫిట్స్ లభిస్తాయి.

కానీ PRC మానిటరీ బెనిఫిట్ 1.4.2020 నుంచి అంటూ 1.7.2019 నుండి 31.3.2020 (9నెలలు) వరకు ఇచ్చిన IR 27% ను లాగేసుకున్నారు

EX: 37100 బేసిక్ గల రవి 27% ప్రకారం నెలకు 10017/- చొప్పున 9నెలలకు పొందిన 90153/- లను తిరిగి చెల్లించాలి

4.IR 27% కంటే తక్కువ ఫిట్మెంటు 23% ఇచ్చి గడచిన కాలం నుంచి PRC అమలు చేస్తే అదనంగా చెల్లించిన IR 4%(1484) ను వెనక్కి రాబట్టవచ్చు.

అనగా 1.4.2020 నుంచి 31.12.21 వరకు 21నెలల పాటు 4% పొందిన అదనపు IR మొత్తం 31164/- ని వెనక్కి తీసుకోనున్నారు

5.CPS రద్దు కోరితే సిటీ కాంపెన్సేట్టరీ అలవెన్స్(CCA) రద్దు చేసిన ప్రభుత్వం

6.  5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి కమిషన్ ను నియమించి PRC అమలు చేసే ప్రక్రియ తొలగింపు.

ఇక నుండి పది సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి అమలు

7.అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందు వయసు 70 నుంచి 80 సంవత్సరాలకు పెంపు.

జీవిత చారమాంకం లోని వారికి  కొడుకులా తోడు ఉండాల్సింది పోయి కోతపెట్టడం దారుణమంటున్నది.

వీటన్నింటినీ మనకు లక్షల్లో రావలసిన DA ARREARSలో deduct చేసి పది, పన్నెండు వేలకు సరిపెట్టనున్నారు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top