PRC సాధన సమితి పత్రికా సమావేశం వివరాలు


PRC సాధన సమితి పత్రికా సమావేశం వివరాలు:

ఉద్యమ కార్యాచరణలో మేం పార్టీలను ఆహ్వానించలేదు - బొప్పరాజు

ప్రభుత్వంపై మేం యుద్ధం ప్రకటించలేదు

ఉద్యమం అంటే.. ప్రభుత్వానికి నిరసన తెలిపే కార్యక్రమం మాత్రమే..

ప్రభుత్వ వైఖరి తీవ్ర ఆవేదన కలిగిస్తోంది

ఉద్యోగులపై ఇలాంటి ఘర్షణ వాతావరణం గతంలో ఎప్పుడూ చూడలేదు

ఉద్యోగ సంఘాలపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారు

ఉద్యోగులను రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు

ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవడం లేదని ఉద్యోగులు గుర్తించాలి

మన డిమాండ్ల సాధనే మనకు ముఖ్యం.. వ్యక్తిగత విమర్శలు వద్దు..

సూర్యనారాయణ కామెంట్స్ ..

ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు కమిటీ వేసినట్లు అధికారిక సమాచారం లేదు

కమిటీ పరిధి, నిర్ణయాధికారంపై మాకు స్పష్టత లేదు

రేపు మధ్యాహ్నం 12 గం.కు చర్చలకు పిలిచారు

పీఆర్‌సీ జీవోల అమలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చేవరకు చర్చలకు వెళ్లం

జనవరి నెలకు డిసెంబరు జీతాన్నే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం

అశుతోష్‌ కమిటీ నివేదికను మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం

బండి శ్రీనివాస్‌

రేపు సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తాం

రేపు మధ్యాహ్నం 3 గం.కు స్టీరింగ్‌ కమిటీ నేతలు వెళ్లి సమ్మె నోటీసు ఇస్తాం

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top