14 నుంచి పాఠశాలల్లో ' కెరీర్ వీక్

 

★ ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, కార్పొరేషన్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తు కోర్సులు, జీవితంలో స్థిరపడేందుకు ఎంచుకోవాల్సిన కెరీర్ గురించి అవగాహన కల్పించనున్నారు.

★ ఉన్నత పాఠశాలల్లో 9, 10 వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు.

★ పాఠశాలల్లో కెరీర్ గైడెన్సుపై ఉన్నత ఉపాధ్యాయులకు డైట్ అధ్యాపకులు , ప్రత్యేక రిసోర్సు పర్సన్లు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు . ఈ ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థులకు కెరీర్ పై మార్గదర్శనం చేస్తారు.

★ ఈ నెల 14 నుంచి 19 వ తేదీ వరకు ' కెరీర్ వీక్ ' నిర్వహించనున్నారు. ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో 9, 10 వ తరగతుల విద్యార్థులకు రోజూ రెండు పిరియడ్లు కెరీర్పై అవగాహన కల్పిస్తారు. 14 న ముందుస్తు పరీక్ష , 19 న తుది పరీక్ష నిర్వహించి వారి ప్రత్యేక సామర్థ్యాల్ని అంచనా వేస్తారు. వీటి ఆధారంగా వారు ఏ కెరీర్లో రాణించే అవకాశం ఉందో తెలియజేస్తారు. దీనికి సంబంధించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక బోధన సామగ్రి పంపారు.

కార్యక్రమం ఇలా ..

★ ఈ నెల 14 న విద్యార్థి కుటుంబంలో ఉన్న వృత్తులు , రోల్ మోడల్ గురించి చెప్పి ముందస్తు పరీక్ష నిర్వహిస్తారు.

★ 15 న విద్యార్థి బలాలు , వాటిని ఉపయోగించుకునే విధానం, అతనికి ఇష్టమైన కెరీర్ ను అంచనా వేసి సొంతంగా అవగాహ పొందే విధంగా మార్గదర్శనం చేస్తారు.

★ 16న హాల్ల్యాండ్ కెరీర్ కోడ్ పరీక్ష నిర్వహిస్తారు

★ 17 న వృత్తులకు సంబంధించిన, విద్యాపరమైన సమాచారం, జాబ్ కార్డులు, కెరీర్ ను ఎంచుకునే విధానం గురించి చెబుతారు.

★ 18 న విద్యార్థి భవిష్యత్తు ప్రణాళిక, తన ప్రత్యేకను చాటుకునే విధానంపై వివరిస్తారు.

★ 19న కెరీర్ డే వేడుకలు నిర్వహిస్తారు.


★ ఉదయం వ్యాసరచన, వక్తృత్వం, తాను ఎంచుకున్న కెరీర్కు  అనుగుణమైన దుస్తులు ధరించటం, 'నా కెరీర్ - నా ఎంపిక అనే అంశంపై రెండు నిమిషాల వీడియోను సంబంధిత విద్యార్థితో చేయిస్తారు. అదే రోజు రెండో పూట అతిథి ఉపన్యాసాలు, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top