ఉక్రెయిన్లో లివింగ్ కాస్ట్ ఎలా ఉంటుంది... ఒక్క విద్యార్థికి అయ్యే ఖర్చు ఎంత....

 Living Cost In Ukraine : రష్యా దాడులతో ఉక్రెయిన్ దద్దరిల్లిపోయింది. వైమానిక దాడులు, పిరంగి మోతలతో అక్కడ భయాణక వాతావరణం నెలకొంది. దీనితో అక్కడే చిక్కుకున్న భారతీయ విద్యార్థుల తరలింపు ప్రక్రియని కేంద్రం ముమ్మరం చేసింది.ఉక్రెయిన్‌లో మొత్తం 24వేల భారతీయ విద్యార్థులు ఉండగా..అక్కడి గగనతలం మూసివేయక ముందు దాదాపు 8 వేల మంది భారత్‌కు చేరుకున్నారు. ఇంకా 16 వేల మంది అక్కడే ఉన్నట్లు అంచనా.

కేవలం భారత్ నుంచి మాత్రమే కాకుండా చాల మంది విద్యార్ధులు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ విద్యనభ్యసిస్తుంటారు. అయితే విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి విద్యనభ్యసించడానికి కారణాలు లేకపోలేదు. పెద్ద దేశాలైన అమెరికా, కెనడా, బ్రిటన్ లతో పోల్చుకుంటే ఉక్రెయిన్‌లో లివింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ.. యూరోప్‌లోనే అత్యంత చౌకైన స్టూడెంట్ జీవన వ్యయం గల దేశం ఉక్రెయినే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇతర దేశాలకు చెందిన విద్యార్థులకు ఉక్రెయిన్ లో విద్యనభ్యసించడానికి మొదటి ఛాయస్ గా ఎంచుకుంటారు.

లివింగ్ కాస్ట్ తో పాటుగా ఇక్కడ కోర్సుల ఫీజులు కూడా చాలా తక్కువ. అందుకే చాలా తక్కువ వ్యయంతో ఉన్నత చదువులు పూర్తి చేసుకోవచ్చనే భావనతో ఉక్రెయిన్ ని ఎంచుకుంటారు. ఇక వైద్య విద్య కోసం ప్రతి ఏడాది భారత్ నుంచి చాలా మంది విద్యార్ధులు ఉక్రెయిన్ వెళ్తుంటారు. ఎందుకంటే మన దగ్గర నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికే సీటు దొరుకుతుంది. ఆ సీట్లు పరిమిత సంఖ్యలో ఉంటాయి.ఎంట్రన్స్ రాసేవారు మాత్రం భారీ సంఖ్యలో ఉంటారు కాబట్టి కాంపీటేషన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. దీనికి తోడు కోర్సుల ఫీజులు కూడా భారీగానే ఉంటాయి.

అయితే ఉక్రెయిన్‌లో లివింగ్ కాస్ట్ అనేది ఎంత ఉంటుంది? ఓ విద్యార్థి ఆ దేశంలో ఉండేందుకు నెలకు ఎంత ఖర్చవుతుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

♦ ఆహారానికి ఒక విద్యార్థికి నెలకు రూ. 10,380 ఖర్చు అవుతుంది. అంటే ఏడాదికి రూ. 1,24,560.

♦ అదే అద్దె నెలకు కనీసం రూ. 16,088 .. సంవత్సరానికి రూ. 1,93,054.

♦ ఎలక్ట్రిసిటీ, గ్యాస్‌కు నెలకు రూ. 1,112.. ఏడాదికి రూ. 13,350

♦ మంచి నీటి కోసం నెలకు 1,320.. సంవత్సరానికి రూ.15,840

♦ బుక్స్ కోసం నెలకు రూ. 147 సంవత్సరానికి రూ.588.

♦ టీవీ కెబుల్‌కు నెలకు రూ.380.. సంవత్సరానికి 4,450

♦ రవాణాకు నెలకు రూ.750 సంవత్సరానికి రూ. 8,900 అవుతుంది.

ఉక్రెయిన్‌లో కోర్సును బట్టి సగటు ట్యూషన్ ఫీజు..

ఇంజనీరింగ్ - రూ. 1,70,922

కంప్యూటర్ సైన్స్ - రూ.1,70,922

సోషల్ సైన్స్ - రూ. 1,85,785

మెడిసిన్ - రూ. 3,12,118

బిజినెస్ అండ్ ఫైనాన్స్ - రూ. 1,48,628

పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులు - రూ. 2,22,942

ఉక్రెయిన్‌లో ఆహార ఖర్చు

ఇతర దేశాలతో పోలిస్తే ఉక్రెయిన్‌లో భోజనం చాలా చౌకగా ఉంటుంది,

ఉక్రెయిన్‌లో లీటర్ పాల ధర రూ. 41.62

డజన్ గుడ్లు రూ. 75

లోకల్ చీజ్ రూ.308, బీఫ్(1 కిలో) రూ. 280

ఒక రొట్టె (500 గ్రా) రూ 23.78

యాపిల్స్(1 కిలో) రూ. 57.96, టమాటలు(1 కిలో) రూ. 95.87

బియ్యం(తెల్లవి) కేజీ రూ. 73.57

అరటి పండ్లు(1 కిలో) రూ. 95.12

మంచి నీరు(1.5 లీటర్ బాటిల్) రూ. 31.12

బంగాళదుంపలు కేజీ రూ. 23 నుంచి రూ. 73 వరకు ఉంటుంది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top