ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం- కారణాలు

 9వ శతాబ్దంలో తూర్పు యూరప్‌లో ఉన్న పెద్ద నగరం కైవ్ ఇది రస్ ( రష్యన్) రాష్ట్రానికి రాజధాని. దీనిని రష్యన్ నగరాలకు తల్లి వంటిది అంటారు. ఎందుకంటే  రష్యా, ఉక్రెయిన్ నగరాల కంటే ముందు శక్తివంతమైన నగరం. ఈ కీవ్ నగరమే ప్రస్తుత ఉక్రెయిన్ దేశ రాజధాని నగరం. ప్రస్తుతం ఈ నగరంపై రష్యా దాడులు చేస్తున్నది, ఇందుకు అనేక కారణాలున్నవి.

👉 తూర్పు యూరప్ లో ఉన్న గణతంత్ర దేశం, యూరప్ లో రష్యా తరువాత రెండవ పెద్ద దేశం ఉక్రెయిన్. దీని రాజధాని కైవ్. 1918 కి ముందు ఈ భూభాగం రష్యన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. 1918 లో ఉక్రెయిన్ పీపుల్స్ రిపబ్లిక్ పేరుతో స్వతంత్ర దేశంగా ఏర్పడింది.

👉 1921 లో ఏర్పడిన సోవియట్ యునియన్ లో 16 దేశాలు ఉన్నాయి(రష్యా, అజర్ బైజాన్,ఉజ్బెకిస్థాన్, జార్జియా, ఎస్తోనియా, లిథువేనియా, లాత్వియా,తజకిస్థాన్, కజకస్థాన్, ఆర్మేనియా, బెలారస్, టర్కమెనిస్థాన్, కిర్గిజిస్తాన్, మాల్ఢవా, మాల్దీవియన్ సొషలిస్ట్ రిపబ్లిక్) అందులో ఉక్రెయిన్ సభ్యదేశంగా ఉండేది. 

👉 1991 లో సోవియట్ యూనియన్(USSR) విచ్ఛిన్నం తరువాత 15 ( ఉక్రెయిన్ తో సహా) సభ్యదేశాలు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. అయితే ఈ దేశాలపై రష్యా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. 

👉 *క్రిమియన్ యుద్ధం*:  నాటి రష్యా భూబాగంలోని నల్ల సముద్రం సరిహద్దుగా ఉన్న క్రిమియా ద్వీపకల్పంలో రోమన్ క్యాథలిక్ చర్చి, రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి హక్కుల కోసం జరిగిన సైనిక వివాదమే *క్రిమియన్ యుద్ధం*. అయితే ఇతర కారణాలు లేక పోలేదు రష్యా క్రిమియా ద్వీపకల్పం, నల్ల సముద్రం పై ఆధిపత్యం చెలాయిస్తే భవిష్యత్తులో తమకు ముప్పు తప్పదని భావించిన ఒట్టోమన్ సామ్రాజ్యం, యునైటెడ్ కింగ్‌డమ్,ఫ్రాన్స్, సార్డీనియా-పీడ్మాంట్ ఒక కూటమిగా ఏర్పడి రష్యన్ సామ్రాజ్యం పై 16 అక్టోబరు1853న యుద్ధం ప్రకటించాయి. మార్చి 16, 1856 న *పారిస్ సంధి* తో యుద్ధం ముగిసింది.

👉 1921 లో క్రిమియన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏర్పడింది. 1945 లో రద్దు చేయబడింది. 1945-54 వరకు రష్యాలో భాగమైంది.‌తరువాత 1954 లో ఉక్రెయిన్ కు బదిలీ చేయబడింది. 1991 లో సోవియట్ యూనియన్ పతనం తరువాత క్రిమియా ఉక్రేనియన్‌లో భాగమైంది మరియు స్వయంప్రతిపత్తి గల గణతంత్ర హోదా ఇవ్వబడింది.

👉 2014, మాత్చి 18న స్వయం ప్రతిపత్తి గల క్రిమియా రష్యన్ ఫెడరేషన్ లో చేరేందుకు అంగీకరింది.అనగా రష్యన్ ఫెడరేషన్‌ లో విలీనం చేయబడింది. అయితే ఉక్రెయిన్ మరియు ఇతర రాజ్యాలు ఇది ఉక్రెయిన్ భూభాగమని గుర్తించాయి.

👉  రష్యా- ఉక్రెయిన్ సంక్షోభానికి *NATO* యే కారణం.

*NATO* North Atlantic treaty organization.

👉రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా, రష్యాలు రెండు అగ్రరాజ్యాలుగా రెండు సైనిక కూటములను ఏర్పాటు చేసుకున్నాయి.రష్యా నేతృత్వంలోని సోవియట్ యూనియన్ ను నిలువరించేందుకు అమెరికా,కెనడా మరో 10 ఐరోపా దేశాలతో కలిసి 1949 లో *నాటో* ఆవిర్భవించింది.

*నాటో చెబుతున్న కారణం*:- ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో సుస్థిరత, శ్రేయస్సులను పెంపొందించటం ద్వారా స్వాతంత్ర్యం, ఉమ్మడి వారసత్వం, నాగరికతలను పరిరక్షించడం.

*వాస్తవం*:- తూర్పు ఐరోపా దేశాలను కలుపుకొని, సైనిక బలగాలను మోహరించడం ద్వారా రష్యాను దెబ్బతీయడమే దీని ప్రధాన ఉద్దేశం. 

👉 1991 సోవియట్ యూనియన్ పతనం తో అమెరికా ఒక్కటే అగ్రరాజ్యంగా అవతరించింది.

👉12 దేశాలతో‌ ప్రారంభమైన నాటో కూటమిలో ప్రస్తుతం 30 దేశాలున్నవి.

👉 ఒకప్పటి సోవియట్ యూనియన్ లోని ఎస్తోనియా, లాత్వయా, లిథువేనియా దేశాలు కూడా 2004 లో నాటోలో చేరాయి. జార్జియా, ఉక్రెయిన్ లు నాటోలో చేరాలని 2008 లోనే పిలుపు అందినా ఇప్పటికీ చేరలేదు.

👉2017 లో యూరోపియన్ యూనియన్(EU)తో ఉక్రెయిన్ తో చేసుకున్న వాణిజ్య ఒప్పందం ప్రకారం ఐరోపా దేశాలతో ఉక్రెయిన్ కు వ్యాపారం పెరిగింది. ఉక్రెయిన్ వాసులు వీసా లేకుండా EUలో ప్రయాణం చేసేందుకు అవకాశం దొరికింది. 2019 లో ఉక్రెయిన్ కొత్త ఆర్థడాక్స్ చర్చికి గుర్తింపు లభించడంతో రష్యా ఆగ్రహం రెట్టింపైంది.

👉 1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత ఉక్రెయిన్ అణునిల్వలను కలిగిన మూడవ పెద్ద దేశం. అయితే  UK,US, ఫ్రాన్స్ ల భద్రతా హామీలతో 1994 లో జరిగిన "బుడాపెస్ట్" ఒప్పందం పై సంతకం చేసింది. 1996 నాటి NPT ప్రకారం అన్ని వార్ హెడ్ లను రష్యాకు బదిలీ చేయడం జరిగింది. ఫలితంగా అణ్వాయుధాలను అన్నిటినీ వదులుకుంది.

👉 అమెరికా మాటలు నమ్మి నాటో వైపు అడుగులు వేసిన ఉక్రెయిన్ నెత్తి నోరు బాదుకుంటున్నా ఇప్పుడు నాటోలో సభ్యత్వం ఇవ్వడం లేదు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ ఆక్రమణకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 

👉సోవియట్ యూనియన్ లో భాగమైన ఉక్రెయిన్ తో రష్యాకు మంచి సంబందాలు ఉండేవి. 2014 లో క్రిమియాపై రష్యా దండెత్తడంతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

👉 యూరోపియన్ యూనియన్ లో చేరడంతో పాటు నాటోలో చేరడానికి చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ తప్పు పడుతున్నారు. పశ్చిమ దేశాల చేతిలో ఉక్రెయిన్ కీలు బొమ్మగా మారిందని రష్యా వాదన.

👉 నాటోలో ఎప్పటికీ చేరబోమని ఉక్రెయిన్ తో పాటు పశ్చిమ దేశాలు కూడా హామీ ఇవ్వాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు.

👉 తమ దేశ భూభాగాలను ఆక్రమించుకునేందుకు పశ్చిమ దేశాలు నాటో కూటమిని ఉపయోగించుకుంటున్నాయని పుతిన్ ఆరోపిస్తున్నారు. తూర్పు ఐరొపాలో నాటో కూటమి సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. తూర్పు ఐరోపా దిశగా నాటోను విస్తరించబోమని అమెరికా తమకు గతంలో హామీ ఇచ్చిందని పుతిన్ చెబుతున్నారు.

👉 నాటో విస్తరణ‌ వల్ల తమకు ముప్పు ఉందని రష్యా భావించడం, ఉక్రెయిన్ ను రష్యాలో కలుసుకోవడం వలన తూర్పు యూరప్ లో తమ ప్రాబల్యం కొనసాగుతుందని రష్యా భావించడం, ఒకప్పుడు జపాన్ వరకు విస్తరించిన రష్యన్ సామ్రాజ్యం తన భూభాగాలను కోల్పోయింది. తిరిగి వాటిని దక్కించుకొని తమ ఉనికిని విస్తరించడం ద్వారా పుతిన్ పై వస్తున్న అవినితి ఆరోపణల నుండి ప్రజల దృష్టిని మరల్చి శక్తివంతమైన నాయకుడు అని నిరూపించుకోవానె తపన పుతిన్ ది అయితే, తూర్పు యూరప్ లో నాటో విస్తరణ ద్వారా అమెరికా ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలన్న లక్ష్యంతో అమెరికా వ్యవహరించడంతో ఉక్రేనియన్ ను అడ్డుపెట్టుకుని ఆడుకుంటున్నాయి.

B.KRISHNA NAIK

SA ( SS), 

ZPHS ( BOYS), GALIVEEDU

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top