ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు నిదర్శనమే నేటి భారీ ర్యాలీ విజయం..
ఓవైపున అడుగడుగునా ప్రభుత్వం వారిచే నిరంకుశ నిర్భంధాలు,అక్రమ అరెస్టులు- మరోవైపు హెచ్చరికలతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లలో భయాందోళనలు కలిగిండం- మరోకోణంలో విరుచుకు పడుతున్న కరోనా నహమ్మారి.. అయినా ఇవేమి ఆక్రోసంతో రగిలిపోతున్న ఉద్యోగులను అడ్డుకోలేకపోయాయి. ప్రభుత్వ చీకటి జీవోలను రద్దు చేయాలని,ఫిట్మెంట్ ఐఆర్ కన్నా ఎక్కువఉండాలని, అసలైన పేకమీషన్ రిపోర్టు బయటపెట్టాలని ,హెచ్ ఆర్ ఏ స్లాబులను యధావిధిగా కొనసాగించాలని ,క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70సంవత్సరాలనుండే ఇవ్వాలని ,రికవరీలు రివర్సు పి ఆర్ సి వద్దనే డిమాండ్లతో విజయవాడ జనసునామీ అయింది. ప్రజలు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు నూరుశాతం సహకారం అందించటం ,స్వచ్ఛంధంగా మంచినీరు తేనీరు ఉచిటంగా అందచేయడం అపూర్వం. ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రిగారు ఇప్పటికైన సజ్జల ,సి యస్ మాటలు -చేతలు ఎంత ప్రమాదాన్ని తెచ్చాయో గమనించి ,ఇంటిలిజెన్సీ రిపోర్టును పరిశీలించి - PRC లో మాకు జరుగుతున్న అన్యాయంను నివారించాలని ,ఘర్షణ వాతావరణం పెరగనీయకుండా నిరోదించాలని మా న్యాయమైన డిమాండ్లను ఆమోదిస్తూ సత్వరం ఉత్తర్వులు జారీచేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నాం.
నేటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జన సందోహం చూడడానికి రెండు కళ్ళూ చాలడంలేదు. కేమేరాలుకు సహితం ఈ సుందర సునామీ దుశ్యాలను బధించ సాధ్యంకాలేదు. నిన్నటినుండి అడుగడుగునా అవాంతరాలతో , ఇబ్బందులతో సతమతమౌతూ కూడా ఈ జన ప్రభంజనం ఆవిష్క్రుతమైదంటే అది మాకు కలిగిన తీవ్ర అసంతృప్తికి నిదర్శనం...దీనిని నివారించకపోతే ఫలితం అనూహ్యంగా ఉంటుందని పాలకులు గమనించాలి.
0 comments:
Post a Comment