Indian Coast Guard Assistant Commandant Recruitment 2022 Notification

 Indian Coast Guard Assistant Commandant Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ (Ministry of Defence)కు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ 1/2023 బ్యాచ్ కోసం అసిస్టెంట్ కమాండెంట్ (Assistant Commandant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ/పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..


వివరాలు:


అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు


మొత్తం ఖాళీలు: ఖాళీల వివరాలు వెల్లడించవల్సి ఉంది.


పోస్టుల వివరాలు:


1. జనరల్ డ్యూటీ (జీడీ)/పైలట్/నావిగేటర్

2. జనరల్ డ్యూటీ (ఉమెన్ – ఎస్ఎస్ఏ)


అర్హతలు: గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


వయోపరిమితి: జూలై 1, 1998 నుంచి జూన్ 30, 2022 మధ్య పుట్టి ఉండాలి.


3. కమర్షియల్ ఫైలట్ లైసెన్స్ (స్త్రీ/పురుషులు)


అర్హతలు: గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే డీజీసీఏ జారీ చేసిన వాలిడ్ కమర్షియల్ ఫైలట్ లైసెన్స్ ఉండాలి.


4. టెక్నికల్ మెకానికల్ (పురుషులు)

5. టెక్నికల్ (ఎలక్ట్రానికల్/ఎలక్ట్రానిక్స్) (పురుషులు) ఈ పోస్టులకు కింది అర్హతలుండాలి.


అర్హతలు: సంబంధిత సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


6. లా ఎంట్రీ (స్త్రీ/పురుషులు)


అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో లా డిగ్రీ ఉండాలి.


వయోపరిమితి: జూలై 1, 1993 నుంచి జూన్ 30, 2022 మధ్య పుట్టి ఉండాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలిమినరీ, ఫైనల్ ఎగ్జామ్), మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.


దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తుకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 16, 2022.


దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 26, 2022.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top