రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 1 నుంచి తొమ్మిదో తరగతి వరకు ఏప్రిల్ నెలాఖరు రోజు చివరి పనిదినంగా, అనంతరం పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ గతంలో క్యాలెండర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఒంటి పూట బడులు జరిపారు. అయితే ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో కాస్త ముందుగానే 1 నుంచి పదో తరగతి విద్యార్థులకు ఒంటి పూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై వివిధ శాఖలతోపాటు విద్యాశాఖ అభిప్రాయాన్ని తీసుకుని ప్రకటించనుంది. గతేడాది ఒంటి పూట బడులను ఉదయం 7.45 గంటల నుంచి 11.30 వరకు తరగతులు నిర్వహించి, ఆ తరువాత మధ్యాహ్న భోజనం అందించారు. ఈ ఏడాది కూడా అదే విధంగా నిర్వహించాలని, అలాగే పరీక్షలకు కనీసం పది రోజుల ముందుగానే సిలబస్ పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. తద్వారా విద్యార్థులకు మరోసారి రివిజన్ చేసుకునే సమయం ఉంటుంది. అలాగే ఫార్మేటివ్ అసెస్మెంట్- 3 పరీక్షల షెడ్యూల్లోనూ స్వల్ప మార్పులు జరగనున్నట్లు సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment