విద్యార్థుల హాజరు వివరాలు పంపండి

*దాని ఆధారంగానే ‘అమ్మఒడి’కి ఎంపిక

*జూనియర్‌ కాలేజీలకు ఇంటర్‌ బోర్డు ఆదేశాలు



 ఇంటర్మీడియెట్‌ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థుల హాజరు వివరాలను తక్షణం పంపాలని రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శేషగిరి బాబు ఉత్తర్వులు జారీచేశారు. 2021 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కళాశాలలు పనిచేసిన దినాలు, విద్యార్థుల హాజరు శాతం తెలియజేస్తూ పీడీఎఫ్‌ ఫార్మాట్‌ లేదా ఎక్సెల్‌ ఫార్మాట్‌లలో వివరాలను సోమవారం మధ్యాహ్నం 1 గంటకల్లా పంపాలని పేర్కొన్నారు. విద్యార్థుల హాజరుకు సంబంధించి ఒక యాప్‌ను అందుబాటులోకి తెచ్చినా చాలా మంది ప్రిన్సిపాల్స్‌ ఆ వివరాలను అప్‌లోడ్‌ చేయడం లేదని తెలిపారు. ఇకనుంచి యాప్‌లోనే విద్యార్థుల హాజరును నమోదు చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్స్‌ పంపే జాబితా ఆధారంగానే విద్యార్థులకు అమలు చేస్తున్న అమ్మఒడి వంటి పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top