జిల్లాల పునర్విభజన సందర్భముగా ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వాలి, స్పౌజ్ (భార్యాభర్తలు) ఒకే చోట ఉండే విధంగా గైడ్లైన్స్ ఇవ్వాలి : కేబినెట్ సబ్ కమిటీ కి ఉద్యోగ సంఘాలు వినతి

విజయవాడ తేది 24-03-2022: రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి ప్రభుత్వ ముఖ్యసలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, గౌరవ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణగారు, శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని) గారు, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) శ్రీ ఎన్. చంద్రశేఖర్రెడ్డి గారు, ప్రభుత్వం తరపునుండి హాజరు కాగా, ఏ.పి. ఎన్జీవో సంఘం నుండి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కామ్రేడ్ బండి శ్రీనివాసరావు, కామ్రేడ్ కె.వి. శివారెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కామ్రేడ్ కె. జగదీశ్వరరావులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో 5-2-2022న ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ఇచ్చిన మినిట్స్లోని అంశాలలో ఇంకా రావలసిన జి.వో. లను గూర్చి చర్చించారు. అందు ముఖ్యంగా

1. తేది 1-7-2019 నుండి 31-3-2020 వరకు ఐ.ఆర్. రికవరీపై తగు క్లారిటీతో జి.వో. ఇవ్వవలసి ఉన్నదని, వెంటనే విడుదల చెయ్యాలని కోరారు. 2. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగి మరియు పెన్షనర్ల దహన సంస్కారాల ఖర్చుల కోసం (మట్టిఖర్చులు) పెంపుదల చేసిన మొత్తముతో జి.వో.ను వెంటనే విడుదల చేయాలని, 3. 11వ పి.ఆర్.సి.ని పబ్లిక్ సెక్టార్, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు మరియు గురుకులాల ఉద్యోగులకు వర్తింప చేస్తూ ఇవ్వలసిన జి.వో.ను తక్షణమే వారంలోపు విడుదల చేయాలని కోరారు.

4. అలాగే పబ్లిక్ ట్రాన్సుఫోర్టు డిపార్టుమెంట్ (ఆర్.టి.సి.) వారికి 11వ పి.ఆర్.సి. ని వర్తింపజేస్తూ జి.వో.ను వెంటనే విడుదల చేయాలని కోరారు. దీనిపై సుదీర్ఘమైన చర్చ అనంతరం ఒక వారం లోపు జి.వో.విడుదల చేయాలని నిర్ణయించడమైనది.

5. డి.ఏ.లకు సంబంధించిన ఎరియర్స్ చెల్లింపుకు కావలసిన జి.వో.ను వెంటనే విడుదల చేయాలని, 6. కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు వెంటనే 2022 రివైజుడ్ పే స్కేల్స్ ప్రకారం అనగా పే, డి.ఏ., హెచ్.ఆర్.ఏ. ఇస్తూ సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

7. జిల్లాల పునర్విభజన సందర్భముగా ఉద్యోగుల కేటాయింపులలో అన్ని డిపార్టుమెంట్లకు సరియైన గైడ్లైన్స్ ఇవ్వాలని, ముఖ్యంగా ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వాలని, స్పౌజ్ (భార్యాభర్తలు) ఒకే చోట ఉండే విధంగా గైడ్లైన్స్ ఇవ్వాలని, గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల కార్యవర్గ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరడమైనది.

8. ప్రభుత్వం నుండి ఉద్యోగులకు చెల్లించవలసిన జి.పి.ఎఫ్., ఏ.పి.జి.ఎల్.ఐ., మెడికల్ బిల్లులు, సరెండర్ లీవులు మరియు పోలీసుల సరెండర్ లీవులు తక్షణమే విడుదల చేయాలని కోరారు. అలాగే ఆర్ధిక శాఖ అధికారులు ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.

9. గతంలో ఏ.పి. జె.ఏ.సి. మరియు ఏ.పి. జె.ఏ.సి. అమరావతి సంయుక్తంగా ఇచ్చిన 71 అపరిష్కుత అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వీటిపై త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని పరిష్కరించుకుందామని కేబినేట్ సబ్ కమిటీ సభ్యులు తెలిపారు.

Download Copy


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top