సీబీఎస్సీ సిలబస్ చదివే విద్యార్థులకు బిగ్ అలర్ట్. పదవ తరగతి అలాగే 12వ తరగతి టర్మ్ 2 పరీక్షల తేదీలను సి బి ఎస్ సి విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 26వ తేదీ నుంచి 2022 న ప్రారంభం అవుతాయని స్పష్టం చేసింది.అలాగే మే 24వ తేదీన ఈ పరీక్షలు ముగుస్తాయని షెడ్యూల్లో ప్రకటించింది సిబీఎసి.
12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ మాసంలో 26వ తేదీ 2022న ప్రారంభం కానున్నాయి అని తెలిపింది. ఈ పరీక్షలు జూన్ 15వ తేదీన పూర్తి కానున్నట్లు షెడ్యూల్ లో వివరించింది. ఈ తేదీలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులందరూ పరీక్షలకు సన్నద్ధం కావాలని.. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. ఇక ముందు ఎవరిని కూడా పాస్ చేయబోమని స్పష్టం చేసింది.
కరోనా తో స్కూల్లు మూతపడటంతో పరీక్షల తేదీల మధ్య గ్యాప్ పెంచారు. అన్ని పరీక్షలు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనున్నాయి. కాగా టర్మ్ 1 పరీక్షలు ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే.


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment