Income Tax: 2022-23 సంవత్సరం కు Income Tax సుమారుగా ఎవరెవరికి ఎంతెంత పడవచ్చు అవగాహన

Income Tax:  2022-23 సంవత్సరం కు income tax సుమారుగా ఎవరెవరికి ఎంతెంత పడుతుందో అవగాహన పరచడం కోసం మరియు నెలనెలా శాలరీ లో ఎంత డిడక్షన్ పెట్టుకుంటే ఫిబ్రవరి 2023 లో ఇబ్బంది పడకుండా ఉంటారని అవగాహన కోసం ఈ పోస్ట్ పెడుతున్నాను. ఇప్పుడు నేను కేళుక్యులేట్ చేసిన tax కంటే ఎవరికి తక్కువ tax పడదు దీని కంటా ఎంతో కొంత ఎక్కువే పడుతుంది. మద్యలో DA లు పడితే ఇంకా tax పెరుగుతాది. హౌసింగ్ లోన్ ఉన్న వాళ్ళకి మాత్రం తగ్గుతాది. ఉదాహరణకు ఎవరికి అయినా హౌసింగ్ లోన్ intrest రెండు లక్షలు ఉంటే వాళ్ళకి నేను పెట్టే టేబుల్లో ఉన్న మొత్తం tax అమౌంట్ కంటే 40వేలు తగ్గుతాది. అంటే రెండు లక్షల్లో 20% 40వేలు అన్నమాట. అలా మీ హౌసింగ్ లోన్ intrest లో 20% లెక్క కట్టి మొత్తం tax అమౌంట్ లో అది తగ్గిస్తే మీకు ఎంత tax పడుతాడో సుమారుగా ఒక అంచనాకు రావచ్చు. OPS వాళ్లకు సేవింగ్స్ 1,50,000/- లు మరియు CPS వాళ్ళకు సేవింగ్స్ 2,00,000/- లు ఉంటేనే సుమారుగా నేను పెట్టే tax పడతాది. సేవింగ్స్ తక్కువగా ఉంటే tax పెరుగుతాది అది గమనించగలరు. DSC వారీగా అనాలసిస్ పోస్ట్ పెడుతున్నాను గమనించగలరు. నెలనెలా ఎంత టాక్స్ డిడక్షన్ చేసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటారో మీరే ప్లాన్ చేసుకోండి. మార్చి నెల జీతం బిల్లు పెట్టే లోపు ఒక నిర్ణయానికి రావలెను.



Income Tax:  2022-23 సంవత్సరం కు Income Tax సుమారుగా ఎవరెవరికి ఎంతెంత పడవచ్చు అవగాహన 

(1998 DSC 10%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 87,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 7000 పెట్టుకుంటే మంచిది.)

(1998 DSC 12%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 90,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 7500 పెట్టుకుంటే మంచిది.)

(2000 DSC 10%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 73,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 6000 పెట్టుకుంటే మంచిది.)

(2000 DSC 12%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 76,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 7000 పెట్టుకుంటే మంచిది.)

(2001 &2002 DSC 10%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 61,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 5000 పెట్టుకుంటే మంచిది.)

(2001&2002 DSC 12%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 64,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 5000 పెట్టుకుంటే మంచిది.)

(2003 DSC 10%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 33,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 2500 పెట్టుకుంటే మంచిది.)

(2003 DSC 12%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 36,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 3000 పెట్టుకుంటే మంచిది.)

(2006 DSC 10%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 31,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 2500 పెట్టుకుంటే మంచిది.)

(2006 DSC 12%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 34,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 2500 పెట్టుకుంటే మంచిది.)

Note: ఇది కేవలం ఉపాధ్యాయుల అవగాహన కొరకు అందించడం జరిగింది ఇదే ప్రామాణికం కాదు


Posted in: , , ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top