తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. కొత్త షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే, ఏప్రిల్ 21 నుంచి జేఈఈ మెయిన్ పరీక్ష కారణంగా షెడ్యూలులో స్వల్ప మార్పులు చేసినట్టు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment