సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌ పథకంలో ప్రతిపాదించిన ప్రభుత్వం ....జీపీఎస్‌ పథకంలో లో లో ముఖ్యాంశాలు

సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్‌ హామీ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకోవాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి డిమాండ్‌ పెరుగుతున్నందున సీపీఎస్‌, పాత పింఛన్‌ విధానానికి (ఓపీఎస్‌) మధ్యేమార్గంగా ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. జీపీఎస్‌ కింద ఉద్యోగుల పదవీవిరమణ నాటి మూలవేతనం (బేసిక్‌ పే)లో 33 శాతం పింఛను భద్రత కల్పిస్తామని చెప్పింది. డీఆర్‌, పీఆర్సీ వర్తించవనీ, ఉద్యోగికి పీఎఫ్‌ ఉండదని స్పష్టం చేసింది. ఉద్యోగి తన వాటాను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. దీన్ని పరిశీలించి సలహాలు, సూచనలు అందించాలని వెల్లడించింది. ఈ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో టక్కర్‌ కమిటీ 50 శాతం పింఛను పథకాన్ని ప్రతిపాదించినా తిరస్కరించామని గుర్తు చేశారు. అంతకుముందు కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకం (సీపీఎస్‌)పై ఉద్యోగ సంఘాలతో చర్చలకు మరో కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.



పాత పింఛను పథకం (ఓపీఎస్‌)

1. ఉద్యోగి పదవీ విరమణ తర్వాత.. వృద్ధాప్యంలో సామాజిక భద్రత ఉంటుంది. పింఛను బాధ్యత ప్రభుత్వానిదే.

2. ఉద్యోగి తన సర్వీస్‌ కాలంలో ఒక్క పైసా కూడా చెల్లించనక్కర్లేదు.

3. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడల్లా డీఏ పెంపు, పీఆర్సీ వర్తించి.. పింఛను పెరుగుతుంది.

4. 70 ఏళ్లు దాటిన వారికి అదనపు క్వాంటం పింఛను, హెల్త్‌ కార్డుల ద్వారా వైద్యం అందిస్తారు.

5. ఉద్యోగికి భవిష్యనిధి (పీఎఫ్‌) ఖాతా ఉంటుంది.

6. కమ్యుటేషన్‌ ఉంటుంది.

7. గ్రాట్యుటీ ఉంటుంది.

గ్యారంటీడ్‌ పింఛను పథకం (జీపీఎస్‌)

1. సీపీఎస్‌ ఉద్యోగి పదవీవిరమణ పొందిన తర్వాత సుమారు 20.3% పింఛను వస్తున్నట్లు లెక్క కట్టి.. దాన్ని 33 శాతానికి పెంచి ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది.

2. ఉద్యోగి తన వాటా (కంట్రిబ్యూషన్‌) చెల్లించాలి.

3. డీఏ పెంపు, పీఆర్సీ వర్తింపుపై స్పష్టత లేదు.

4. అదనపు క్వాంటం పింఛను, హెల్త్‌ కార్డులపై ఏం చెప్పలేదు.

5. పీఎఫ్‌ ఖాతా ఉండదు.

6. కమ్యుటేషన్‌ ఉండదు.

7. గ్రాట్యుటీపైనా స్పష్టత లేదు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top