పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పులుండవు
విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దు
పకడ్బందీగా పరీక్షలను నిర్వహిస్తున్నాం
ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి షేర్ చేసేవారిపై కఠిన చర్యలు
ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి
:రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 9 వరకు జరుగుతాయని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.కాబట్టి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి బయటకు పంపేవారిపైన, వాటిని షేర్ చేసేవారిపైన కేసులు నమోదు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో లేదా ఇతర మార్గాల్లో ఎవరికైనా వస్తే పోలీసులకు లేదా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లా, మండల విద్యాశాఖాధికారులు కూడా ప్రశ్నపత్రాలు షేర్ చేస్తున్నవారి నంబర్లను పోలీసులకు తెలియజేయాలన్నారు.


.jpeg)
Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment