గూడ్స్ ట్రెయిన్ మేనేజర్ (Goods Train Manager) పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.ఆన్‌లైన్ అప్లికేషన్లు ఏప్రిల్ 25 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మొత్తం 147 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులు సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలో ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 147
ఇందులో జనరల్ 84, ఓబీసీ 32, ఎస్సీ 21, ఎస్టీ 10 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా డిగ్రీ చేసి 18 నుంచి 42 ఏండ్ల లోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 25
వెబ్‌సైట్: www.rrchubli.in
Complete Notification: Click Here


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment