*మే 25 నుంచి జూన్ 19 వరకు వేసవి సెలవులు
*ఆ రోజుల్లో తరగతులు నిర్వహించే కళాశాలలపై చర్యలు
*ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు
ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాయబోయే ప్రథమ, ద్వితీయ ఏడాది విద్యార్థులకు హాల్‌టికెట్లు సిద్ధమయ్యాయి. వీటిని ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల (జ్ఞానభూమి) లాగిన్‌కు అప్‌లోడ్ చేశారు. ప్రిన్సిపాళ్లు ఈ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసి తమ కళాశాల విద్యార్థులకు అందిస్తారని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని జిల్లాల ప్రాంతీయ విద్యాధికారులు ఈ విషయాన్ని జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు తెలపాలని సూచించారు. కాగా, ఇంటర్ కళాశాలలకు మే 25 నుంచి జూన్ 19వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. జూన్ 20వ తేదీన కళాశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. అన్ని ఇంటర్ కళాశాలలు వేసవి సెలవులను ఇవ్వాలని, ఆ రోజుల్లో తరగతులు నిర్వహించే ప్రైవేటు కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే విద్యాసంవత్సరానికి విద్యార్థుల అడ్మిషన్లు ఇంటర్ విద్యామండలి నిబంధనల ప్రకారం జరగాలని స్పష్టం చేశారు.
స్కూళ్లకు మే 6 నుంచి జూలై 3 వరకు సెలవులు
రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న పాఠశాలలకు మే 6వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. జూలై నాలుగో తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి
0 comments:
Post a Comment