Kendriya vidyalaya admissions 2022-23 కేంద్రీయ విద్యాలయాల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గానూ రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు నోటిఫికేషన్

Kendriya vidyalaya admissions 2022-23 for class 2 and above: దేశ వ్యాప్తంగావున్న పలు  విద్యాలయాల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గానూ రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు శుక్రవారం (ఏప్రిల్ 8) నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియకేంద్రీయ ప్రారంభమైంది.పదో తరగతి ఫలితాలు ప్రకటించిన 10 రోజులలోపు 11వ తరగతి రిజిస్ట్రేషన్‌లు కూడా ప్రారంభమౌతాయి. అడ్మిషన్లు కోరే విద్యార్ధుల తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్‌ kvsonlineadmission.kvs.gov.in.లో ఏప్రిల్‌ 16 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ప్రవేశం కోరుతున్న పిల్లల ఫొటోలు, డేట్ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికేట్‌, ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికేట్ వంటి ఇతర డాక్యుమెంట్లను తప్పనిసరిగా సబ్‌మిట్ చెయవల్సి ఉంటుంది.

KVS Admissions 2022కు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ kvsonlineadmission.kvs.gov.inను ఓపెన్ చెయ్యాలి.

హోమ్‌పేజ్‌లో కనిపించే రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చెయ్యాలి.

అవసరమైన ఆధారాలను నమోదు చేసి, అవసరమైన అన్ని సర్టిఫికేట్లను ఆప్‌లోడ్‌ చేసి, సబ్‌మిట్‌ చెయ్యాలి.

పూర్తి చేసిన దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసి, ప్రింట్‌ఔట్‌ చేసుకోవాలి.

Official Website: kvsonlineadmission.kvs.gov.in


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top