పిఆర్సి బకాయిలు దఫదఫాలుగా ఇవ్వాలి సిఎంను కోరిన ఎపి ఎన్జిఒ నాయకులు

*పిఆర్సి బకాయిలు దఫదఫాలుగా ఇవ్వాలి

*సిఎంను కోరిన ఎపి ఎన్జిఒ నాయకులు

❇️పిఆర్సి బకాయిలు ఉద్యోగ విరమణ తరువాత కాకుండా దఫదఫాలుగా చెల్లించాలని ఎపి ఎన్ఆఒ నాయకులు మఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కోరారు . గురువారం తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఆయన్ను నాయకులు బండి శ్రీనివాసరావు , కె.వి. శివారెడ్డి , సిహెచ్ . పురుషోత్తమనాయుడు , ఈశ్వరరావు , శ్రీనివాసరావు , చంద్రశేఖరరెడ్డి , వెంకటేష్ బాబు , రమణారెడ్డి , జానీబాషా కలిశారు . పిఆర్సి తదితర సమస్యలపై సిఎంకు 12 వినతిపత్రాలు సమర్పించారు . అనంతరం శ్రీనివాసరావు , శివారెడ్డి మాట్లాడుతూ .. పిఆర్సి అమలు చేసిన ప్రతిసారీ బకాయిలు వెంటనే చెల్లించారని , ఉద్యోగ విరమణ అనంతరం వచ్చేలా ఉత్తర్వులు ఇవ్వలేదని పేర్కొన్నారు . ఉద్యోగ విరమణ తరువాతే ఇవ్వాలని ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల వల్ల ఉద్యోగులు , పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు .

 అనామలీస్ కమిటీని నియమించి ఐఆర్ 27 శాతం కంటే నాలుగు శాతం తక్కువ ఇచ్చిన ఫిట్మెంట్ను సవరించి 27 శాతం వచ్చేలా చూడాలని తద్వారా అసంతృప్తితో కూడిన ఉద్యోగులను సంతృప్తి పరచాలని కోరారు . గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల అధ్యక్ష , కార్యవర్గ సభ్యులను తొమ్మిదేళ్లు బదిలీ చేయకుండా ఉండాలనే ఉత్తర్వులను పునరుద్ధరించాలన్నారు . పిటిడి ఉద్యోగులకు 11 వ పిఆర్సిని వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు . ఉద్యోగ సంఘ నాయకులు వివరించిన సమస్యలన్నిటినీ విన్న సిఎం సానుకూలంగా స్పందించారు .

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top