విద్యాశాఖ అధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు జగనన్న అమ్మఒడికి సంబంధించి తగు సూచనలు జారీ.

జిల్లా లోని అన్నీ ఉప తనిఖీ అధికారులకు మండల విద్యాశాఖాధికారులకు మరియు యులకు అమ్మ ఒడి KYC మరియు NPCI కొరకు తగు సూచనలు జారీ చేయుటమైనది.* ప్రభుత్వ నిబంధనల ప్రకారము NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ లో మాత్రమే అమ్మబడి డబ్బులు పడతాయి. NPCI లింక్ అయిన బ్యాంకు వివరాలు మాత్రమే స్కూల్ లాగిన్ లో ENROLL చేయాలి. NPCI అనగా NATIONAL PAYMENT CORPORATION OF INDIA. ఇది కేవలం అమ్మఒడి అనే కాదు ప్రభుత్వం నుండి రావాల్సిన ఏ నగదు అయినా NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ లో మాత్రమే పడతాయి.

* బ్యాంకు అకౌంట్ NPCI కి లింక్ చేయటమంటే బ్యాంకు అకౌంట్ ఆధార్ తో లింక్ చేయబడి ఉండటమే. ఒక వ్యక్తికి మూడు లేదా నాలుగు బ్యాంకు అకౌంట్ లు ఉంటే వాటిలో ఒక బ్యాంకు అకౌంట్ మాత్రమే NPCI కి లింక్ అయి ఉంటుంది. NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ కు మాత్రమే పరిగణలోనికి తీసుకుంటారు.

• స్కూల్ కి NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ ను మాత్రమే ఇవ్వాలి. రెండు వేరు వేరుగా ఉన్నాయి అంటే అమ్మఒడి డబ్బులు రావు, రెండు ఒకటి ఉండేలా అటు బ్యాంకు లో అయినా లేదా ఇటు స్కూల్ లో అయినా మార్చుకోవాలి.

• తల్లి తండ్రుల స్కూల్ కి ఇచ్చిన అకౌంట్ INACTIVE లో ఉంది అంటే సంబంధిత బ్యాంక్ అకౌంట్ NPCI లింక్ ఐ ఉండలేదు అని భావించవలెను. వెంటనే సంబందిత బ్యాంక్ వారిని సంప్రదించి అకౌంట్ ను NPCI లింక్ చేయించుకోవాలి అప్పుడు మాత్రమే అకౌంట్ ACTIVE లో కి వచ్చును.

* విద్యార్థి తల్లి / సంరక్షకుని బ్యాంక్ అకౌంట్ ఇచ్చినవారి కుటుంబములో సంబంధిత విద్యార్ధి నమోదు కాబడి ఉనవలెను లేనిచో వాలెంటీర్ ద్వారా E KYC చేయించుకొనవలెను. కావున ప్రతీ విద్యార్థి తల్లి / సంరక్షకుని బ్యాంక్ నందు NPCI లింక్ మరియు వాలెంటర్ ద్వారా E KYC

తప్పనిసరిగా చేయించికొనవలెనని తెలియజేయుటమైనది. అందరు మండల విద్యాశాఖాధికారులు మరియు ప్రధానోపాధ్యాయులు పై సూచనలును విద్యార్థుల తల్లి / సంరక్షకునికి తెలియచేయు చర్యలు తీసుకోవలసినదిగా ఆదేశించడమైనది.

Download Copy

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top