పదో తరగతి పరీక్షల్లో సాధిం చిన మార్కుల ఆధారంగానే ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలు ఉండే అవకాశం ఉందని ఆర్జే యూకేటీ ఒంగోలు డైరెక్టర్ బి. జయరామిరెడ్డి పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలలో కోవిడ్ కారణంగా పదో తరగతి విద్యార్థులు మొత్తం ఉత్తీర్ణులు అయిన నేపథ్యంలో ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహించి నట్టు తెలిపారు. ఈ క్రమంలో ఈ విద్యా సం వత్సరం పరీక్షలు నిర్వహించినందున ఫలితాలు వెలువడిన వెంటనే ప్రవేశాలకు జూన్ మొదటి వారంలో ఆర్జేయూకేటీ - 2023 నోటిఫికేషన్ ను వీసీ రాజిరెడ్డి సూచనల మేరకు విడుదల చేస్తారని తెలిపారు. ఈనెల 12 తర్వాత టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ జరగనున్న నేపథ్యంలో నెలాఖరుకు టెన్త్ ఫలితాలు వెలు వడే అవకాశం ఉందని, ఈ క్రమంలో నోటిఫికే షన్లు వెలువరిస్తారని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment