SBI Yono Credit | భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన కస్టమర్ల కోసం రియల్‌టైం ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ (ఆర్టీఎక్సీ) అందుబాటులోకి తెచ్చింది. తమ ఖాతాదారుల్లో వేతన జీవులకు ఎస్బీఐ తన యోనో ప్లాట్‌ఫామ్ మీద ఈ రుణ పరపతి కల్పిస్తున్నది.అర్హులైన కస్టమర్లు రూ.35 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందేందుకు ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ అనుమతిస్తున్నది.
తమ కస్టమర్లలో వేతన జీవులకు ఎస్బీఐ పర్సనల్ లోన్ ప్రొడక్ట్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్. ఇది డిజిటల్‌గా మాత్రమే లభ్యం అవుతుంది. ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా అర్హులైన ఖాతాదారులు యోనో ద్వారా రూ.35 లక్షల వరకు పొందొచ్చునని ఎస్బీఐ తెలిపింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, రక్షణశాఖ ఉద్యోగుల్లో ఎస్బీఐ ఖాతాదారులకు రియల్ టైం ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కింద రుణ పరపతి లభిస్తుంది. ఖాతాదారులు పర్సనల్ లోన్ కోసం తమ శాఖకు రానవసరం లేదు. క్రెడిట్ చెక్స్, అర్హత, రుణం మంజూరు, డాక్యుమెంటేషన్ రియల్‌టైంలో డిజిటల్‌గా పూర్తవుతుంది అని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment