AP Model Schools | ఈ మోడల్ స్కూల్లో ప్రవేశాలు ప్రత్యేకతలు ఇవే

అమరావతిలోని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ కార్యాలయం - మోడల్‌ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 164 మోడల్‌ స్కూల్స్‌ ఉన్నాయి.లాటరీ పద్ధతి ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. బోధన ఉచితం. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది.

అర్హత: ప్రభుత్వ/గుర్తింపు పొందిన పాఠశాలలో నాలుగు, అయిదు తరగతులు చదివి ఉండాలి. జనరల్‌, బీసీ విద్యార్థులు 2010 సెప్టెంబరు 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 2008 సెప్టెంబరు 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.100; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50

అడ్మిషన్‌ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: జూన్‌ 16

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 17

ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల: జూన్‌ 30

సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌: జూలై 1న

వెబ్‌సైట్‌: apms.apcfss.in

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top