ఈరోజు గుర్తింపు పొందిన సంఘాలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ B. రాజశేఖర్, కమిషనర్ S. సురేష్ కుమార్, SPD ఎ ట్రీ సెల్వి, జేడీ సర్వీసెస్ రామలింగం , ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప రెడ్డి గార్ల తో సమావేశం జరిగింది .ఈసమావేశంలో ప్రస్తావించిన ప్రధానాంశాలు.
ఈరోజు గుర్తింపు పొందిన సంఘాలతో విద్యాశాఖ మంత్రి గారి సమావేశంలో ప్రస్తావించిన ప్రధానాంశాలు
**విద్యా హక్కు చట్టం లో గాని ,జాతీయ విద్యా విధానంలో గాని పాఠశాల విలీనం లేదా విభజన అంశం లేదు కనుక ఈ ప్రక్రియ చేపట్టడం సరైన విధానం కాదని స్పష్టంగా చెప్పాము.
*ప్రతి ప్రాథమిక పాఠశాల కు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని
* పాఠశాల విద్యలో తెలుగు, ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని,
* ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులను,వ్యాయామఉపాద్యాయులను కొనసాగించాలని.
* ప్రాథమికొన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు కొనసాగించాలని,
* ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల వర్క్ లోడ్ 32 పీరియడ్స్ కి మించకుండా చూడాలని ,
*మైనర్ మీడియం స్కూల్ లను ఇతర మీడియం స్కూల్ లలో విలీనం చేయరాదని,
*SA హిందీ, సెక్షన్ ల ఆధారం గా కాకుండా విద్యార్థుల సంఖ్య ఆధారంగా కేటాయింపు చేయాలని,
*SA పోస్టులను సెక్షన్ల ఆధారంగా కాకుండా తెలుగు,ఇంగ్లీషు మీడియం ఆధారంగా కేటాయింపు చేయాలని,
** ప్రాథమిక పాఠశాల లలో 1:20; ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1: 35 ;ఉన్నత పాఠశాల 1:40 గా నిర్ణయించాలని
**ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 80కి పైగా బడిన పాఠశాలలకు పి ఎస్ హెచ్ ఎం పోస్టులు మంజూరు చేయాలని,
**పి ఎస్ హెచ్ ఎం పోస్ట్ని బలవంతంగా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ గా మార్పు చేయరాదని,
* అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్ గా ప్రమోషన్ కల్పించాలని,
* గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపల్ గా ప్రమోషన్లు కల్పించాలనికోరాము..
**బదిలీలకు సంబంధించి స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరాము.
***మనతో పాటు మిగిలిన సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వారం లోపు తగు నిర్ణయం చేస్తామని మంత్రి గారు తెలిపారు.
****విధానపరమైన అంశాలపై ఎలాంటి హామీ ఇవ్వలేదు.అలాగే GO 117 పై పరిశీలిస్తామని చెప్పారు...
0 comments:
Post a Comment