ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి భారీ ఎత్తున నగదును విత్ డ్రా పై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన డీఏ ఎరియర్స్ క్రెడిట్ అయిన విషయంలో గందరగోళం ఏర్పడింది.బిల్లులు పాస్ చేయకుండానే క్రెడిట్ డబ్బులు అయ్యాయి. ఉద్యోగులకు సంబంధం లేకుండానే డబ్బులు విత్‌డ్రా అవ్వడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆందోళనను ఆర్ధిక శాఖ అధికారుల దృష్టికి ఎన్జీవో అసోసియేషన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ములు విత్ డ్రా అవటం పై ఉద్యోగుల
ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ అంశాన్ని ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ రావత్, సత్యనారాయణలను కలిసి వివరించామని, పొరపాటు జరిగిందని అధికారులు అంగీకరించారన్నారు.
సాంకేతిక సమస్య వల్ల జరిగి ఉంటుందని తెలిపినట్లు, ఈ సాయంత్రం ఐదు గంటల వరకు ఏం జరిగిందో స్పష్టత ఇస్తామన్నారని వారు పేర్కొన్నారు. కింది స్థాయి అధికారుల నుండి నివేదిక తెప్పిస్తామని భరోసా ఇచ్చారని వెల్లడించారు. సీఎఫ్ఎమ్‌ఎస్ విధానం వల్ల అనేక సాంకేతిక సమస్యలు వస్తున్నాయని, సీఎఫ్ఎమ్‌ఎస్ వ్యవస్థను రద్దు చేసి పాత ట్రెజరీ విధానాన్నే తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశామన్నారు. సంబంధిత అధికారులు బిల్లులు పాస్ చేయకుండానే కొంత మంది ఉద్యోగులకు డబ్బులు క్రెడిట్ అయినట్లు గమనించారన్నారు. 1-7-2018, 1-1-2019 డీఏ ఎరియర్స్ వేశామని అంటున్నారు అవి క్రెడిట్ కాలేదని చెప్పామన్నారు.
0 comments:
Post a Comment