Jobs in TCS: ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ చదివినవారికీ టీసీఎస్ ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

 టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగాల భర్తీకి వేర్వేరు డ్రైవ్స్ నిర్వహిస్తోంది. ఇప్పటికే స్మార్ట్ హైరింగ్ 2022, ఎంబీఏ హైరింగ్ 2022, ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ 2022, అట్లాస్ హైరింగ్ 2022 పేరుతో పలు రకాల డ్రైవ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.టీసీఎస్‌లో ఉద్యోగాలు పొందాలంటే బీటెక్, ఎంటెక్, ఎంబీఏ లాంటి కోర్సులు చదవాలని అనుకుంటారు నిరుద్యోగులు. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ సబ్జెక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు కూడా టీసీఎస్‌లో ఉద్యోగాల కోసం అప్లై చేయొచ్చు. ఇందుకోసం టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ (TCS BPS Hiring) కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. టెక్ కోర్సులు కాకుండా ఆర్ట్స్, కామర్స్, సైన్స్ కోర్సులు చదివినవారిని టీసీఎస్ కాగ్నిటీవ్ బిజినెస్ ఆపరేషన్స్ (CBO), బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్ (BFSI), లైఫ్ సైన్సెస్ విభాగాల్లో నియమిస్తోంది టీసీఎస్.

టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ ప్రోగ్రామ్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. చివరి తేదీ, పరీక్ష తేదీ, ఇంటర్వ్యూ తేదీలను వెల్లడించలేదు టీసీఎస్. 2020, 2021, 2022 సంవత్సరాల్లో ఆర్ట్స్, కామర్స్, సైన్స్ గ్రాడ్యుయేషన్ పాసైనవారు టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ ప్రోగ్రామ్‌కు అప్లై చేయొచ్చు. ఫుల్ టైమ్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కోర్సులు పూర్తి చేసినవారు మాత్రమే అప్లై చేయాలి. బీకామ్, బీఏ, బీఏఎఫ్, బీబీఐ, బీబీఏ, బీబీఎం, బీఎంఎస్, బీఎస్సీ ఐటీ, సీఎస్, జనరల్, బీసీఏ, బీసీఎస్, బీఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సులు చదివినవారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు https://www.tcs.com/careers/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

TCS BPS Hiring 2022: టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

Step 1- టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ ప్రోగ్రామ్‌కు అప్లై చేయడానికి https://www.tcs.com/careers/tcs-bps-hiring లింక్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో వివరాలన్నీ చదివిన తర్వాత TCS Next Step Portal లింక్ పైన క్లిక్ చేయాలి.

Step 3- హోమ్ పేజీలో Register Now పైన క్లిక్ చేయాలి.

Step 4- ఆ తర్వాత BPS పైన క్లిక్ చేయాలి.

Step 5- పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, విద్యార్హతలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 6- వివరాలు సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

Step 7- అప్లికేషన్ స్టేటస్‌లో Application Received అని ఉండాలి.

Step 8- Application Received అని స్టేటస్ ఉంటే రెండో స్టెప్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

Step 9- ఇందుకోసం CT/DT ఐడీతో రెండో స్టెప్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Step 10- https://www.tcs.com/careers/tcs-bps-hiring వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Apple Here with CT/DT ID పైన క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

Join Job Notifications Group:

https://chat.whatsapp.com/F61l8QDY9A9GY9UkMfrE1U


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top