Supreme Court Recruitment 2022: సుప్రీంకోర్టులో 210 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

Supreme Court Junior Translator Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని సుప్రీం కోర్టు (Supreme Court)లో..జూనియర్ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్) (Junior Court Assistant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 210

పోస్టుల వివరాలు: జూనియర్ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్) పోస్టులు

వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.35,400ల నుంచి రూ.63,068ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఇంగ్లీష్‌ టైపింగ్ నైపుణ్యంతోపాటు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరం.

ఎంపిక విధానం: రాత పరీక్ష, కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: మొత్తం 100 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు 2 గంటల్లో సమాధానాలు రాయవల్సి ఉంటుంది. ఈ పరీక్ష రోజున కంప్యూటర్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (25 మార్కులకు), ఇంగ్లీష్‌ టైపింగ్‌ టెస్ట్ (35 మార్కులకు,10 నిముషాలు), ఎస్సే రైటింగ్‌ టెస్ట్ (2 గంటలు) కూడా నిర్వహిస్తారు. ప్రతిభ కనబరచిన అభ్యర్ధులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

జనరల్‌ అభ్యర్ధులకు: రూ.500

ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు: రూ.250

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 10, 2022.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top