WhatsApp | ఇక ఇప్పుడు వాట్సాప్ లో 2GB సైజు గల వీడియోలు కూడా పంపించవచ్చు

Whatsapp |ఇప్పుడు ప్రతి మొబైల్‌లో వాట్సాప్ కామన్‌గా మారిపోయింది. ఫొటో, వీడియో ఏది షేర్ చేయాలన్నా వాట్సాప్‌లోనే పంపిస్తున్నారు. కానీ ఇందులో ఒకే ఒక్క సమస్య !!పెద్ద సైజ్ వీడియోలను ఇతరులకు పంపించలేం. కేవలం 100 ఎంబీ లోపు ఫైల్స్‌ను మాత్రమే పంపించుకునే వెసులుబాటు ఉంది. దీంతో చాలామంది యూజర్లు పెద్ద ఫైల్స్‌ను పంపించేందుకు ఇబ్బంది పడేవారు. ఈ సమస్యను గమనించిన వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2 జీబీ వరకు సైజ్ కలిగిన ఫైల్స్‌ను పంపించుకునే ఛాన్స్ ఇచ్చింది. అంటే ఒక సినిమా మొత్తాన్ని మనం వాట్సాప్‌లో షేర్ చేయొచ్చన్నమాట !!


నిజానికి 2 జీబీ వరకు ఫైల్స్‌ను పంపించుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నామని ఈ ఏడాది మార్చిలోనే వాట్సాప్ ప్రకటించింది. అన్నట్టుగానే ఈ ఫీచర్‌ను అర్జెంటీనాలో తీసుకొచ్చి ప్రయోగాత్మకంగా పరీక్షించింది. తాజాగా ఈ ఫీచర్‌ను ఇతర ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ యూజర్లు ఎవరైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. కాకపోతే ఇది ఒకేసారి అందరికీ అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి కొంతమంది యూజర్లు మాత్రమే ఈ ఫీచర్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. మిగిలిన యూజర్లకు త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

మీకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందా?

100 ఎంబీ కంటే ఎక్కువ ఫైల్స్‌ను షేర్ చేసుకునే సదుపాయం మీకు వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఏం లేదండీ.. ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేయండి.. ఆ తర్వాత ఏదైనా ఓ కాంటాక్ట్ నంబర్‌కు 100 ఎంబీ కంటే ఎక్కువ సైజ్ ఉన్న వీడియోను డాక్యుమెంట్ రూపంలో అటాచ్ చేయండి. అప్పుడు ఆ వీడియో అప్‌లోడ్ అయితే మీకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్టే. ఒకవేళ అప్‌లోడింగ్ ఫెయిలైతే.. ఈ ఫీచర్ కోసం మీరు ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే !!

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top