Agniveer Navy: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. అగ్నివీర్ MR రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల..!



అగ్నిపథ్ స్కీమ్ కింద భద్రతా దళాల్లో రిక్రూట్‌మెంట్‌కు వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి.తాజాగా మెట్రిక్ రిక్రూట్ (MR) పోస్టుల కోసం ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. జులై 15 నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఇండియన్ నేవీ అగ్నివీర్ MR రిక్రూట్‌మెంట్‌కు నమోదు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్యమైన తేదీలు, అర్హత ప్రమాణాలతో పాటు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని వివరాలు చెక్ చేయండి..

మెట్రిక్ రిక్రూట్ (MR) కోసం ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2022 జులై 15 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇండియన్ నేవీ మంగళవారం ఒక ట్వీట్‌ షేర్ చేసింది. ఇండియన్ నేవీ అగ్నివీర్ MR రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జులై 30. మరోవైపు, ఇండియన్ నేవీ SSR రిక్రూట్‌మెంట్ 2022 ప్రక్రియన ఇప్పటికే కొనసాగుతోంది.

ఇండియన్ నేవీ మీడియా చేసిన ట్వీట్‌లో.. 'మీరు దేశానికి సేవ చేయాలని కోరుకుంటే, అగ్నిపథ్‌ కింద రిజిస్టర్ చేసుకోండి. ఇండియన్ నేవీలో అగ్నివీర్‌గా చేరండి. 2022 బ్యాచ్‌ కోసం అప్లికేషన్ విండో జులై 15న ఓపెన్ అవుతుంది. అన్ని వివరాలతో https://joinindiannavy.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోండి' అని పేర్కొంది.

* అర్హతలు ఏంటి?

ఈ పోస్ట్‌కు అర్హత సాధించడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇండియన్ నేవీ MR రిక్రూట్‌మెంట్ కింద సైన్యం మూడు డొమైన్‌లలో తాత్కాలికంగా 200 ఖాళీలను భర్తీ చేస్తుంది. వీటిలో చెఫ్ (MR), స్టీవార్డ్ (MR), హైజీనిస్ట్ (MR) విభాగాలు ఉన్నాయి. ఇండియన్ నేవీ అగ్నివీర్ ఏజ్ లిమిట్ ప్రకారం.. అభ్యర్థుల వయసు రిజిస్టర్ చేసుకున్న తేదీ నాటికి 17.5 -21 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే అగ్నివీర్ 2022 బ్యాచ్‌కు మాత్రమే 23 సంవత్సరాల వరకు గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించారు.

* ఎలా దరఖాస్తు చేయాలి?

స్టెప్ 1: ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్‌ joinindiannavy.gov.in కి వెళ్లండి.

స్టెప్ 2: అవసరమైన వివరాలు నింపి రిజిస్టర్ చేసుకోండి. మీ లాగిన్ వివరాలు క్రియేట్ చేయండి.

స్టెప్ 3: ఇప్పుడు వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యి అగ్నివీర్ MR రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోండి.

స్టెప్ 4: అప్లికేషన్ ఫారమ్‌ నింపి, స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.

స్టెప్ 5: అన్ని వివరాలు చెక్ చేసి అప్లికేషన్ సబ్‌మిట్ చేయండి.

స్టెప్ 6: భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ ప్రింట్ తీసుకోండి.

రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, శారీరక దృఢత్వ పరీక్షల ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు. పోస్ట్‌ను బట్టి ఇతర రిక్రూట్‌మెంట్ ప్రమాణాలు కూడా వర్తిస్తాయి. మరింత సమాచారం కోసం అభ్యర్థులు నోటిఫికేషన్‌ చెక్ చేయవచ్చు. అయితే ఈ నోటీసు త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల కావచ్చని అధికారులు తెలిపారు.

షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు INS చిల్కాలో బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత వివిధ నావల్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్లలో కేటాయించిన ట్రేడ్‌లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ పొందుతారు. సేవల అవసరాన్ని బట్టి బ్రాంచ్ / ట్రేడ్ కేటాయిస్తారు.

Official Website: joinindiannavy.gov.in

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top