జాతీయ ఉపకార వేతనాలు గురించి సంచాలకులు, ప్రభుత్వ పరీక్షలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి పత్రిక ప్రకటన

2022 వ సంవత్సరం మార్చి 20 న జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్షలో ఎంపిక అయిన ప్రతీ విద్యార్థి ఈ సంవత్సరం తప్పకుండా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ వేతనాలు  www.scholarships.gov.in లో నమోదు చేసుకొనవలెను. ఈ సంవత్సరం ఎంపిక అయిన విద్యార్ధులు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా చరవాణికి వచ్చిన యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ల ద్వారా లాగిన్ అయ్యి అప్లికేషన్ ను అప్లోడ్ చేయవచ్చును. రిజిస్ట్రేషన్ తప్పకుండా ఆధార్ వివరములు నమోదు చేయుట ద్వారా మాత్రమే చేయవలెను. నమోదు. ప్రక్రియకు ముందుగానే ప్రతి విద్యార్ధి తప్పకుండా వారి దగ్గరలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో గాని లేదా NEFT సౌకర్యం కలిగిన ఏదైనా జాతీయ బ్యాంక్ లో విద్యార్థి తల్లి లేదా తండ్రితో కలిసి ఉమ్మడి ఖాతా తెరవవలెను. బ్యాంక్ ఖాతాకు విద్యార్ధి యొక్క ఆధార్ ను మాత్రమే అనుసంధానించవలెను మరియు బ్యాంక్ పాస్ బుక్ లో విద్యార్ధి పేరు తప్పకుండా మొదట ఉండవలెను. విద్యార్ధి వివరములు ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ లో ఉన్న విధంగా మాత్రమే ఆధార్ మరియు బ్యాంక్ ఖాతాలలో ఉండవలెను. లేనియెడల అప్లికేషన్ అప్లోడ్ అవ్వదు. ఈ స్కాలర్షిప్ కి ఎంపిక అయిన ప్రతి విద్యార్థికి సంవత్సరమునకు రూ.12,000/- ప్రత్యక్షంగా వారి బ్యాంక్ ఖాతాలో SBI, న్యూ ఢిల్లీ వారి ద్వారా జమచేయబడుతాయి. విద్యార్థి వివరములలో ఏమయినా దిద్దుబాట్లు ఉన్న యెడల వెంటనే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో సంప్రదించవలెను. స్కాలర్షిప్ పోర్టల్ లో అప్లోడ్ చేయుటకు విద్యార్ధి యొక్క ఫోటో, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, అంగవైకల్యం ఉన్నవారు అంగవైకల్య ధృవీకరణ పత్రం మొదలగు వాటిని వెంటనే సిద్ధపరచుకొనవలెను. ఏ కారణం వల్ల అయినా పోర్టల్ లో నమోదు చేసుకొనని విద్యార్ధులకు ఇక ఎప్పటికీ స్కాలర్షిప్ మంజూరు కాబడదు. ఒకరికి ఒకే స్కాలర్షిప్ అనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇప్పటికే వేరే విధమైన స్కాలర్షిప్ పొందుచున్న విద్యార్ధులు ఆయా స్కాలర్షిప్ లనుండి ఉపసంహరించుకున్న యెడల మాత్రమే ఈ జాతీయ ఉపకార వేతనమునకు నమోదు చేసుకొనుటకు వీలు కలుగుతుంది. నవంబరు 2018 , 2019, ఫిబ్రవరి 2020 సంవత్సరాలలో ఈ పరీక్ష వ్రాసి ఎంపిక కాబడి పోర్టల్ లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్ధులు ఈ సంవత్సరం తప్పకుండా వారి అప్లికేషన్ ను రెన్యువల్ చేసుకొనవలెను. విద్యార్ధులు అప్లోడ్ చేసిన ఫ్రెష్ / రెన్యువల్ అప్లికేషన్ ను సంబంధిత పాఠశాల/ కళాశాల నోడల్ ఆఫీసర్ లాగిన్ ద్వారా తప్పక వెరిఫై చేయించుకొనవలెను. తదుపరి సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి లాగిన్ ద్వారా కూడా వెరిఫై చేయించుకొనవలెను. దీనికొరకై విద్యార్థులు తమ పోర్టల్ అప్లికేషన్ ప్రింట్ కు ధృవపత్రములను జతపరచి సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో తప్పకుండా అందజేయవలెను. విద్యార్ధి తరచుగా విద్యార్ధి లాగిన్ ద్వారా అప్లికేషన్ స్థితి తనిఖీ చేసుకొనవలెను. దీనికొరకై NSP అనే ఆండ్రాయిడ్ యాప్ ద్వారా గాని UMANG అనే ఆండ్రాయిడ్ యాప్ ద్వారా కూడా మొబైల్ ఫోన్లో తనిఖీ చేసుకొనవచ్చును. ప్రతి విద్యార్ధి అప్లికేషన్ ను పాఠశాల/కళాశాల లాగిన్ మరియు జిల్లా విద్యాశాఖాధికారి వారి లాగిన్ల ద్వారా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా వెరిఫై చేసినయెడల మాత్రమే విద్యార్థికి స్కాలర్షిప్ మంజూరు చేయబడుతుంది అని సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేశారు.



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top