విదేశీ విద్యకు జగనన్న ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.....

విదేశాల్లో ఉన్నతవిద్య కోసం కొత్త పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది..

◻️ పథకం అమలుకు సంబంధించి

మార్గదర్శకాలు జారీ - క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారం ఖర్చు భరించనున్న ప్రభుత్వం.. తొలి 200 వర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చు భరించనున్న తెలిపింది..

◻️ తొలి 100 ర్యాంకుల్లోని వర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజురీఎంబర్స్ మెంట్ - 100-200 ర్యాంకుల్లోని వర్శిటీల్లో వస్తే రూ.50 లక్షల వరకు రీఎంబర్స్ మెంట్ అమలు..

◻️ నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రీఎంబర్స్ మెంట్.. ల్యాండింగ్ పర్మిట్ సాధిస్తే మొదటి వాయిదా చెల్లించాలని నిర్ణయం..

◻️ ఐ-94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధిస్తే మొదటి వాయిదా చెల్లించాలని నిర్ణయం - సెమిస్టర్, టర్మ్ ఫలితాల తర్వాత వాయిదా మొత్తం చెల్లించాలని నిర్ణయం - 

◻️ పీహెచ్‍డీ, ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏడాది, సెమిస్టర్ వారీగా రీఎంబర్స్ మెంట్ - ఏడాదికి రూ.8 లక్షలలోపు ఆదాయం ఉంటే పథకం వర్తిస్తుందని స్పష్టం.. 

◻️ 35 ఏళ్లలోపు వయసున్న స్థానికులు అర్హులుగా గుర్తింపు - కుటుంబంలో ఒకరికి మాత్రమే పథకం వర్తిస్తుందని స్పష్టం - ఏటా సెప్టెంబర్, డిసెంబర్, జనవరి, మే నెలలో నోటిఫికేషన్ జారీకి నిర్ణయం

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top