DEO Anantapuram Schools Maping | స్కూల్ మ్యాపింగ్ రికార్డుల నిర్వహణ, ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులు జారీ చేయుట గురించి Rc.2835

స్కూల్ మ్యాపింగ్ రికార్డుల నిర్వహణ, ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులు జారీ చేయుట గురించి...

సూచిక:-

1. G.O.Ms.No. 1 Education (PC-2) Department dated: 01.01.1994 

2. Progs Rc.No.ESE02-13/90/2021-EST 3-CSE-Part (7),Date:13/06/2022 of the Commissioner of School Education, AP, Amaravathi 

3. Progs Rc. No. ESE02-13/90/2021-EST 3-CSE-Part (7). Date:05/07/2022 of the Commissioner of School Education, AP,Amaravathi

4. Progs Rc.No.ESE02-13/90/2021-EST 3-CSE-Part (8),Date:14/07/2022 of the Commissioner of School Education, AP,Amaravathi



జిల్లా DEO Anantapuram Schools Maping | స్కూల్ మ్యాపింగ్ రికార్డుల నిర్వహణ, ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులు జారీ చేయుట గురించి Rc.2835 

 అందరూ జిల్లా ఉన్న విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడమేమనగా సూచిక 1 మరియు 2 నందు కమిషనర్ పాఠశాల విద్య అమరావతి వారు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు క్రింద తెలిపిన విధముగా స్కూల్ మ్యాపింగ్ పాఠశాల నిర్వహణ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం జరిగినది కాపున జిల్లా ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులు సూచిక 1 మరియు 2 జారీచేసిన ఉత్తర్వులకు అనుగుణంగా జరిగిన ప్రక్రియను తూచా తప్పకుండా తము తమ పరిధిలోని పాఠశాలల యందు పాటించవలసిన దిగా కోరడమైనది.

పాఠశాల విద్య స్కూల్ మ్యాపింగ్: 

> ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలను

1) ఫౌండేషన్ స్కూల్'(1-2)

2) ఫౌండేషన్ ప్లస్ స్కూల్'(1-5)

3) ప్రీ-హైస్కూల్ (3-8)

4) హై స్కూల్ (8-10)

పాఠశాలలుగా మార్పు చేయడం జరిగింది.

> ప్రభుత్వ, జిల్లా పరిషత్ /మండల ప్రజా పరిషత్ వంటి వివిధ యాజమాన్య పాఠశాలల నిర్వహణలో బోధనా సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం నిబంధనలపై ఉత్తర్వులు జారీ చేసింది. G.O.Ms.No.117. d:10.06.2022న మరియు G.O.Ms.No.128, dt:13.07.2022 ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు /ఉత్తర్వుల ప్రకారం హేతుబద్ధీకరణ ప్రక్రియను చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు.జారీ చేయబడ్డాయి. 

> G.0.Ms.No.117, dt:10.06.2022లో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లా ఎంపిక కమిటీ ఆమోదములే

 1) ఒక కిలోమీటర్ పరిధిలోని ఫౌండేషన్ ప్రస్ పాఠశాలల యొక్క 3, 4, 5వ తరగతులను ప్రీ-హై స్కూల్లకు లేదా హై స్కూల్ మ్యాప్ చేయబడ్డాయి. 

2) అలాగే మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రీ-హై స్కూల్స్ నందని 6,7,8వ తరగతుల విద్యార్థులు హైస్యూతం మ్యాప్ చేయబడి ఉన్నారు.

3) అలాగే NEPలో భాగంగా మ్యాప్ చేయబడి సీటుపంటి అన్ని పాఠశాలలో తమ పాఠశాలలో నికి కి మాలి చేయబడిన ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల విద్యార్థులను తమ పాఠశాలలో 3,4,5 తరగతులయందు అలాగే ప్రాథమికోన్నత పాఠశాల లోని 6, 7, 8 తరగతులు విద్యార్థులను తమ పాఠశాలలో 6, 7, 8 తరగతులలో అడ్మిషన్ చేసుకోవడానికి అనుమతించబడింది.కాపున ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పై విషయాలను దృష్టిలో ఉంచుకొని అడ్మిషన్స్ ను తమ పాఠశాలలో నిర్వహించుకోవలసినదిగా 

4) ప్రస్తుతం ఏడవ తరగతి వరకు మాత్రమే ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి నిర్వహించుకోవడానికి ఆదేశించడం అయినది.అనుమతించబడిన పాఠశాల జాబితాలను అనుబంధం-1 గా మీకు అందించడం జరుగుచున్నది.

5) మ్యాపింగ్ ప్రక్రియలో ప్రభావితమయ్యే పాశాలల జాబితాను అనుబంధం అనుబంధం 2 మీకు అందించడం జరుగుతున్నది.

6) అలాగే ప్రాథమికోన్నత పాఠశాల విషయంలో 6, 7, 8 తరగతులు నమోదు 'సున్నా' గా కలిగిన పాఠశాలలను డీగ్రేడ్ చేసి ప్రాథమిత పాఠశాల గా నమోదు చేయవలసిందిగా ఆదేశించడం అయినది.

5) మ్యాపింగ్ ప్రక్రియలో ప్రభావితమయ్యే పాఠశాలల జాబితాను అనుబంధం అనుబంధం 2 మీకు అందించడం జరుగుచున్నది.

6) అలాగే ప్రాథమికోన్నత పాఠశాల విషయంలో 6. 7. 8 తరగతులు నమోదు 'సున్నా' గా కలిగిన పాఠశాలలను డీగ్రేడ్.చేసి ప్రాథమిక పాఠశాల గా నమోదు చేయవలసిందిగా ఆదేశించడం అయినది.

స్కూల్ మ్యాపింగ్ విద్యార్థులనమోదు:

> కావున పై పాఠశాలల్లో మ్యాప్ చేయబడ్డ 3, 4, 5వ / 6.7, 8వ తరగతుల విద్యార్థులనందరినీ ఫ్రీ-హై స్కూల్ లేదా హై స్కూల్ ల్లో 15.07.2022 తారీకు సాయంత్రం నాలుగు గంటల లోగా నమోదు చేయించ వలసిందిగా తగు చర్యలు తీసుకోవలెను. > గతంలో 250 మీటర్ల పరిధిలోని ప్రాథమిక పాఠశాలల నందలి 3, 4, 5వ తరగతులను ఉన్నత పాఠశాలకు పంపడము జరిగింది. కానీ ప్రస్తుత మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా ఉన్నత పాఠశాలలో గదుల కొరత కారణంగా ఆ ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలకు మ్యాప్ చేయబడలేదు. కావున ఆ ప్రాథమిక పాఠశాలను తిరిగి ఫౌండేషన్ ప్లస్ పాఠశాలగా తక్షణమే (1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు) నిర్వహించాలి.

> అలాగే ప్రస్తుతం ఏడవ తరగతి వరకు మాత్రమే ఉన్నటువంటి అన్ని ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలలలో ఎనిమిదవ తరగతి కూడా ఈ విద్యాసంవత్సరం తమ పాఠశాలలో నిర్వహించవలసిందిగా ఆదేశించడం అయినది.

 > అలాగే upgradationలో భాగంగా Upgrade చేసినటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలో 8.9, 10 తరగతులు కూడా నిర్వహించుకోవచ్చునని తెలియజేయడమైనది.

స్కూల్ మ్యాపింగ్ రికార్డుల నిర్వహణ :

> ప్రీ-హైస్కూలు లేదా హైస్కూల్ కు మ్యాప్ చేయబడిన విద్యార్థుల బదిలీ సర్టిఫికేట్/ రికార్డ్ షీట్ ను ప్రీ-హై స్కూల్స్, లేదా హైస్కూల్ హెడ్ మాస్టర్లకు అందజేయవలెను.

> అలాగే ప్రతి విద్యార్థికి సంబంధించిన ఎలాంటి రికార్డు మిస్ అవ్వలేదని / చిరిగిపోలేదని నిర్ధారణ చేసుకోవాలి.

 > మ్యాపింగ్ ప్రక్రియలో విద్యార్థులను నమోదుచేసుకొనబోయే పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ విద్యార్థుల కోసం ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించకూడదు. వారు ఇప్పటికే ఉన్న రిజిస్టర్లలో ఈ విద్యార్థులను నవీకరించాలి.

 > అలాగే విద్యార్థుల చైల్డ్ ఇన్ఫో వివరాలు పాత పాఠశాలల నుండి ప్రస్తుతం మ్యాపింగ్ చేయబడిన పాఠశాలలకు ఆన్లైన్ నందు బదిలీ చేయవలెను.

స్కూల్ మ్యాపింగ్ ఉపాధ్యాయుల సర్దుబాటు : 

> RTE నిబంధనల ప్రకారం ప్రమోషన్లు మరియు ఉపాధ్యాయుల బదిలీ పూర్తయ్యే వరకు (ఉపాధ్యాయు...సర్దుబాటు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఈ విషయంలో జీవో నెంబర్ 117 మరియు 128 ఆధారంగా), చెప్పబడిన పునర్విభజన ప్రక్రియ తర్వాత, ఫౌండేషన్ ప్లస్, ప్రీ-హైస్కూల్ మరియు హైస్కూల్ లో ఎవరైనా ఉపాధ్యాయులు. మిగులు ఉన్నట్లు గుర్తించినట్లయితే, వారిని పాఠశాల కాంప్లెక్స్లో లేదా అదే మండలంలో తాత్కాలితంగా సర్దుబాటు చేయవలయును.

Download Proceeding Copy


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top