JNV Admissions 2022 | నవోదయ విద్యాలయలలో 11వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు


JNV Admissions 2022 | నవోదయ విద్యాలయలలో 11వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు 

పదో తరగతి(10th class) పూర్తి చేసిన విద్యార్థుల(Students)కు అలర్ట్.జవహర్ నవోదయ విద్యాలయాల్లో పదకొండవ తరగతి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నవోదయ విద్యాలయ సమితి తన అధికారిక వెబ్‌సైట్‌లో JNV 11వ తరగతి ప్రవేశ ప్రక్రియను ప్రారంభించి, లాటరల్ అడ్మిషన్ ఫారమ్స్‌ కూడా విడుదల చేసింది. 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inకి వెళ్లి అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. JNV 11వ తరగతి లాటరల్ ఎంట్రీ అడ్మిషన్‌కు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 18గా నిర్ణయించారు.

10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయాల్లో సైన్స్(Science), కామర్స్, ఒకేషనల్, హ్యుమానిటీస్ కోర్సులలో అడ్మిషన్ పొందవచ్చు. JNV 11వ తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా 1 జూన్ 2005 - 31 మే 2007 మధ్య జన్మించి ఉండాలి. ఈ వయోపరిమితి నియమం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్యార్థులతో సహా మిగతా అభ్యర్థులందరికీ వర్తిస్తుంది.

JNV అడ్మిషన్ 2022కి ఎలా దరఖాస్తు చేయాలి?

స్టెప్ 1: విద్యార్థులు మొదటగా నవోదయ అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inకి వెళ్లాలి.

స్టెప్ 2: హోమ్‌పేజీలో '2022-23 సెషన్‌లో Class XI Lateral Entry Admission కోసం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోండి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top