విద్యాశాఖా మంత్రిగారు, జె.డి. సర్వీసెస్ మువ్వా రామలింగంగారు మరియు టెక్నికల్ టీం ఇచ్చినటువంటి సమాధానాలు.
1. అందరు ఉపాధ్యాయులకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉండదు. కొందరికి ఐ-ఫోన్ ఉంటుంది. కొందరికి బేసిక్ ఫోన్ మాత్రమే ఉంటుంది. కొందరికి ఈ యాప్ ఉపయోగించటం రాకపోవచ్చు.
సమాధానం : ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోయిన, టెక్నాలజీ వాడటం తెలియకపోయిన హెచ్.యం. ఫోన్లో గాని,
సహ ఉపాధ్యాయుల ఫోన్లో గాని లాగిన్ అయ్యి హాజరు వేయవచ్చు.
2. ఇంటర్ నెట్ బ్యాలన్స్ అయిపోయే పరిస్థితి ఉంటుంది? గ్రామాలలో ఇంటర్ నెట్ సౌకర్యం లేదు?
సమాధానం: ఫోన్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా, గ్రామాలలో ఇంటర్నెట్ లేకపోయినా 9గంటల లోపు ఫోన్ ద్వారా అటెండెన్స్ యాప్ లో ఫోటో తీస్తే ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన వెంటనే మనము ఏ సమయంలో అయితే ఫోటో తీశామో, ఆ సమయంతోనే అటెండెన్స్ పడుతుంది.
3. సర్ఫర్ బ్రేక్డౌన్ (విచ్ఛిన్నం) కావచ్చు? సర్వర్ కెపాసిటీ చాలకపోవచ్చు?..
సమాధానం : గత రెండు రోజుల నుండి ఈ విధమైన సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకే ఇంకొక రెండు
ఎక్కువ కెపాసిటీ కలిగిన సర్వర్లు అందుబాటులోనికి తీసుకువచ్చాము. కాబట్టి సర్వర్ ప్రాబ్లమ్ ఉండదు
4. ఏదో ఒక సందర్భంలో ఫోన్ పాడయిపోవచ్చు. ఫోన్ పోవచ్చు. రిపేర్ చేయించుటకు లేదా క్రొత్త ఫోన్ కొనుక్కోవటానికి కొంత సమయం పట్టవచ్చు.
సమాధానం : ఫోన్ అందుబాటులోకి వచ్చే వరకు సహ ఉపాధ్యాయుల ఫోన్లో లో లాగిన్ అయ్యి అటెండెన్స్ వేయవచ్చు.
5. రాష్ట్రంలో దాదాపు 15,000కు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెలవు పెట్టినపుడు ప్రక్కపాఠశాలల నుండి డెప్యూటేషన్పై రావాలి. ఆ ఉపాధ్యాయుడు తన పాఠశాలలో హజరువేసుకొని ఈ స్కూల్ కి రావాలి. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి విద్యార్థులు ఇళ్ళకు వెళ్ళిపోతారు.
సమాధానం: ఈ సమస్యలను పరిష్కరించవలసి ఉంది. టెక్నికల్ టీమ్ తో చర్చించాము. త్వరలోనే సమస్య పరిష్కరించబడుతుంది.
▪️ప్రస్తుతం ఆగస్టు 30వ తేదీ వరకు శిక్షణాకాలంగా భావిస్తూ అటెండెన్స్ వేయకపోయినా ఏటువంటి చర్యలు ఉండవని, అటెండెన్స్ వేసే వారికి ఎదురయ్యే ప్రతి సమస్య మీద ఆగస్టు నెల చివరినాటికి మరలా చర్చిస్తామని మంత్రిగారు తెలిపారు...
0 comments:
Post a Comment