Jio Phone 5G: జియో 5జీ ఫోన్.. ధర, ఫీచర్లు, విడుదల తేదీ వివరాలివే!


Jio Phone 5G: జియో 5జీ ఫోన్.. ధర, ఫీచర్లు, విడుదల తేదీ వివరాలివే!

సామాన్యులకు స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయాలనే ఉద్దేశంతో జియో సంస్థ గతేడాది జియో ఫోన్ నెక్ట్స్‌ను విడుదల చేసింది.

₹ 5వేలకే ఆకర్షణీయమైన ఫీచర్స్ ఇస్తుండటంతో కొనుగోలుకు యూజర్లు ఆసక్తి కనబరిచారు. దీనికి కొనసాగింపుగా త్వరలోనే జియో కంపెనీ 5జీ ఫోన్‌ను తీసుకురానుంది. ఇప్పటికే 5జీ ఫోన్‌కు సంబంధించిన పనులపై కంపెనీ దృష్టి సారించినట్లు సమాచారం. దసరా లేదా ఈ ఏడాది చివరినాటికి జియో 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తారని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి.

దీంతో ఈ మొబైల్‌ గురించి టెక్ వర్గాల్లో చర్చ మొదలైంది. మరి, ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లుంటాయి? ధరెంత ఉండొచ్చనే వివరాలపై ఓ లుక్కేద్దాం.

జియో 5జీ ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్తే ఇస్తున్నారట. గూగుల్‌, జియో కలిసి అభివృద్ధి చేసిన ప్రగతి ఓఎస్‌తోనే ఈ ఫోన్ పనిచేస్తుంది.స్నాప్‌డ్రాగన్‌ 480 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్‌ ఎక్స్‌ 51 మోడెమ్‌ ఉంటుంది. ఈ మొబైల్‌ 5 రకాల 5జీ బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తాయని అంచనా.

వెనుకవైపు 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 2 ఎంపీ కెమెరా, ముందుభాగంలో 8 ఎంపీ కెమెరా ఇస్తున్నారట.వెనుక లేదా సైడ్‌లో ఫింగర్‌ ప్రింగ్‌ సెన్సర్‌ ఉంటుందని టెక్‌ వర్గాలు తెలిపాయి.

ఆల్వేస్‌ ఆన్‌ గూగుల్‌ అసిస్టెంట్‌, గూగుల్‌ లెన్స్‌, ట్రాన్స్‌లేట్‌ లాంటి గూగుల్‌ యాప్స్‌ ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. అలాగే మై జియో, జియో టీవీ వంటి వాటితోపాటు ఉచితంగా ఇతర జియో యాప్స్‌ కూడా ఇస్తారు.5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది.

4 జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత స్టోరేజీ వేరియంట్లో తీసుకొస్తున్నారట. డ్యూయల్‌ సిమ్‌, మెమొరీ కార్డు ఆప్షన్‌ ఇస్తున్నట్లు సమాచారం,

జియో 5జీ ఫోన్‌ ధర విషయానికొస్తే... రూ. 10 వేల నుంచి రూ. 12 వేల మధ్య ఉండొచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా. జియో ఫోన్ నెక్ట్స్‌ తరహాలో యూజర్లు ₹ 2,500 చెల్లించి 5జీ ఫోన్‌ను సొంతం చేసుకునేలా ఈఎంఐ పద్ధతి ఉంటుందని సమాచారం,

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top