Teachers Face Recognition App: ఫేస్ యాప్ అటెండెన్స్ పైన ఉపాధ్యాయుల ఆందోళన.. రంగంలోకి మంత్రి బొత్స. సత్యనారాయణ గారు.

 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా టీచర్ల అటెండెన్స్ కోసం ఫేస్ రికగ్నిషన్ యాప్‌ ఇప్పుడు గందరగోళం సృష్టిస్తోంది.. హాట్ టాపిక్‌గా మారిన ఈ యాప్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది.



టీచర్లు స్కూళ్లకు రాగానే ముందుగా చేయాల్సిన పని ఫొటో దిగడం.. పాఠశాలల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం.. అయితే, ఆ యాప్‌లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టీచర్లకు కోపం తెప్పిస్తోంది. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న బయోమెట్రిక్, ఐరిస్ స్థానంలో ఫేస్ యాప్ విధానాన్ని ప్రవేశ పెట్టడం.. టీచర్లు ఒక్క నిమిషం ఆలస్యంగా విధులకు హాజరైనా హాఫ్ డే లీవ్ గా పరిగణించేలా రూపొందించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.. అయితే, ఈ వ్యవహారంలో రంగంలోని దిగారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఉపాధ్యాయ సంఘాలతో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానున్నొరు.. ఫేస్ యాప్ ద్వారా అటెండెన్స్ విషయంలో నెలకొన్న గందరగోళం, యాప్ వద్దంటూ ఉపాధ్యాయ సంఘాల చేస్తున్న ఆందోళనపై చర్చించనున్నారు.. మూడు గంటలకు మంత్రి బొత్స, విద్యాశాఖ అధికారులతో సమావేశం కానున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.

మరోవైపు, మూడో రోజు ఉపాధ్యాయ సంఘాలో ఆందోళనకు కొనసాగిస్తున్నాయి.. అటెండెన్స్ యాప్ ను పూర్తిగా తొలగించాలంటున్నాయి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులపై యాప్ ల భారం అధికమైందని..మంత్రి బొత్స తో చర్చలు విఫలం అయితే ఉద్యమం మరింతా ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరగబడుతున్నరు కాబట్టే మాపై ఈ కక్ష్య పూరిత ఆలోచన అని ఆరోపిస్తున్నారు. అటెండెన్స్ యాప్ నిర్ణయం పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఫేస్ యాప్ పై విద్యశాఖ అధికారులు, మంత్రి బొత్స తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది యూటీఎఫ్.. సొంత ఫోన్‌లో ఉపాధ్యాయులు హాజరు వేయరు.. హాజరు వేయడానికి కొత్త డివైజ్ లు ఇవ్వాలని.. 9 దాటితే సెలవంటూ షోకాజ్ నోటీసులు ఇస్తాం అంటూ బెదిరిస్తున్నారు… ఇప్పటికే 14కు పైగా యాప్స్ ఉన్నాయి… యాప్స్ కాకుండా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ పెంచాలని.. యాప్స్ పేరుతో ఉపాధ్యాయులను వేధించటం సరైంది కాదంటున్నారు యూటీఎఫ్‌ నేతలు.

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top