ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. 57 అంశాలకు ఆమోదం


ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. 57 అంశాలకు ఆమోదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో జరిగిన  ఈ భేటీలో 57 అంశాలకు కేబినెట్‌  ఆమోదం తెలిపింది. అలాగే పలు కీలక అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంది. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వైఎస్సార్‌ చేయూత, దివ్యాంగులకు 4 శాతం ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు, భావనపాడు పోర్టు విస్తరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

AP Cabinet Meeting CM YS Jagan

వైఎస్ఆర్ చేయూత పై స్టేటస్ నివేదికను కేబినెట్ ఆమోదం

గ్రేటర్ విశాఖ, విశాఖ, అనకాపల్లి జిల్లాలో లక్ష ఇళ్ల నిర్మాణానికి పాలనా పరమైన అనుమతులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ఉద్యోగుల పదోన్నతుల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లకు ఆమోదం

రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం

గ్రీన్ ఎనర్జీ లో రూ.81వేల కోట్ల పెట్టుబడుల ప్రాజెక్టు ఆమోదం

భావనపాడు పోర్టు విస్తరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

నెల్లూరు, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్ ల ఏర్పాటునకు కేబినెట్ ఆమోదం, ఒక్కో ఆదాలత్ కు పది పోస్టులకు మంత్రిమండలి ఆమోదం

కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ మినహాయింపు ర్యాటీఫైకి కేబినెట్ ఆమోదం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటునకు ఆమోదం

ఈ నెల 15 నుండి అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయం

ఏపి సచివాలయంలో 85 అదనపు పోస్టుల మంజూరుకు కేబినెట్ అమోదం

పాఠశాలల్లో 8 తరగతి విద్యార్ధులకు ట్యాబ్ ల పంపిణీకి మంత్రిమండలి ఆమోదం

నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటునకు కేబినెట్ ఆమోదం

కురుపాం ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీలో సిబ్బంది నియామకానికి ఆమోదం

ప్రతి మండలంలో రెండు పీహెచ్ సీలకు కేబినెట్ ఆమోదం

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top