Andhra News: సీపీఎస్ పై రెండు నెలల్లో నిర్ణయం వెల్లడిస్తాం: మంత్రి బొత్స సత్యనారాయణ
ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)పై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. సీపీఎస్‌పై ప్రభుత్వ నిర్ణయాన్ని రెండు నెలల్లో వెల్లడిస్తామని తెలిపారు.
ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ''ఎన్నికల ముందు మా పార్టీ ఇచ్చిన 100 హామీల్లో సీపీఎస్ ఒకటి. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. సీపీఎస్‌పై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆమోదయోగ్యంగా ఉంటుంది. మా నిర్ణయం రెండు నెలల్లో వెల్లడిస్తాం. ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఈ ఏడాది ఆఖరికల్లా పరిష్కరిస్తాం'' అని బొత్స వెల్లడించారు. కాగా ఇటీవల ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చల సందర్భంగా సీపీఎస్ రద్దుపై తాము తొందరపడి హామీ ఇచ్చామని మంత్రి బొత్స వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment