గ్రామ పంచాయతీ ఉద్యోగులు (Ap Gram Panchayat Employees) ప్రభుత్వానికి సమ్మె నోటీసు (Strike Notice) ఇచ్చారు. అక్టోబరు రెండు నుంచి నిరవధిక సమ్మె చేపడతామని నోటీస్ లో పేర్కొన్నారు.పీఆర్ కమిషనర్‌కు సీఐటీయూ (CITU) అనుబంధ పంచాయతీ ఉద్యోగుల సంఘం నేతలు నోటీసు పంపించారు. ప్రధాన డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చారు.
ప్రధాన డిమాండ్లు ఇవే...
1. బకాయి జీతాలు వెంటనే చెల్లించి కార్మికుల కుటుంబాలను కాపాడాలి
2.పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్‌లకు కనీస వేతనం నెలకు రూ.20 వేలు చెల్లించాలి
3.మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా నెలకు రూ.6 వేలు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ వర్తింపజేయాలి
4.పంచాయతీ కార్మికులకు 2015లో హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయాలి
6. కార్మికుల తొలగింపులు ఆపాలి.
7. జీవో 551 రద్దు చేయాలి.
8. జీవో 132ను అన్ని స్థాయిల్లో అమలు చేయాలి
9. బకాయి జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి
10. సర్పంచి, అధికారుల వేధింపులు నివారించి ఉద్యోగ భద్రత కల్పించాలి
11. రక్షణ పరికరాలు, యూనిఫాం వంటివి సకాలంలో అందించాలి
12. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు రూ.10 లక్షలు, సాధారణ మృతికి రూ.5 లక్షలు ఇవ్వాలి
13. ఇళ్లు, కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలి
0 comments:
Post a Comment