ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పింఛన్ ఇచ్చేటప్పుడు.. ప్రజలకు సేవచేసే ఉద్యోగులకు మాత్రం ఎందుకు ఇవ్వరని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. శ్రీకాకుళంలో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆఽధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం బదిలీలకు అవకాశం కల్పించాలని, స్పౌజ్ ట్రాన్స్‌ఫర్స్‌కు అవకాశమివ్వాలని కోరారు. మరణించిన సచివాలయ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. చాలామంది ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉన్న జిల్లాలో నాన్‌లోకల్ కింద ఉద్యోగం పొందారని.. గత మూడేళ్ల నుంచి కుటుంబాలకు దూరమై వేరే జిల్లాల్లో ఉద్యోగం చేస్తున్నారని.. వారికి కూడా ప్రభుత్వం బదిలీల అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏపీజీడబ్ల్యుఎస్ ఈడబ్ల్యుఎస్ రాష్ట్ర అడహాక్ కమిటీ ప్రధాన కార్యదర్శి వి. అర్లయ్య, కృష్ణా జిల్లా సహాధ్యక్షులు బి.జగదీష్, ఆరు జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment