Heart Failure Sign: హార్ట్ ఫెయిల్యూర్‌కు ముందు శరీరం 5 సంకేతాలు ఇస్తుంది.. నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు ఇవే.

Heart Failure Sign: మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయం గుండె. ఇతర అవయవాలతో సహా శరీరమంతా రక్తాన్ని పంప్ చేస్తుంది.



Heart Failure Sign: మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయం గుండె. ఇతర అవయవాలతో సహా శరీరమంతా రక్తాన్ని పంప్ చేస్తుంది. గుండె బలహీనంగా మారినప్పుడు, సరిగ్గా పనిచేయడంలో విఫలమైనప్పుడు గుండె ఆరోగ్యం బలహీనపడుతుంది. ఈ పరిస్థితి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది అవయవాల వైఫల్యానికి కూడా కారణమవుతుంది. మన దేశంలో చాలా వరకు హార్ట్ ఫెయిల్యూర్ కేసులు బాడీ పార్ట్స్ వైఫల్యం కారణంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత నిర్ధారణ అవుతాయి. అవయవాల వైఫల్యం కారణంగా రక్త నాళాలు దెబ్బ తింటాయి. గుండె కండరాలకు రక్తాన్ని అందించడంలో విఫలమవుతాయి. దీని కారణంగా గుండె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఇది గుండె సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

హార్ట్ ఫెయిల్యూర్ ప్రారంభ లక్షణాలను గ్రహించడం చాలా ముఖ్యం. అలా గ్రహించడం వలన ప్రమాదాన్ని ముందే పసిగట్టి అలర్ట్ అవ్వొచ్చు. ఆరోగ్యం క్షీణించకుండా ఉంటుంది. మరి ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఊపిరితిత్తుల్లో పట్టేసినట్లుగా..

గుండె ఆరోగ్యం క్షీణించడం వల్ల ఊపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోతుంది. దీని కారణంగా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ సమయంలో అలర్ట్‌గా ఉండి వెంటనే వైద్యులను సంప్రదించాలి.

2. కాళ్ల వాపు..

గుండె ప్రభావవంతంగా రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు శరీరంలోని దిగువ భాగాలకు పంప్ చేయబడిన రక్తాన్ని తిరిగి తీసుకోవడంలో విఫలమవుతుంది. ఇది కాళ్లు, చీలమండలు, పొత్తికడుపు, తొడలలో పేరుకుపోయి వాపుకు కారణమవుతుంది.

3. శ్వాస ఆడకపోవడం..

ఊపిరితిత్తులలో రక్తం పేరకుపోవడం వలన కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉండే రక్తాన్ని తాజాగా ఆక్సిజన్ ఉన్న రక్తంగా మార్చడం కష్టమవుతుంది. ఊపిరితిత్తుల్లో నిమ్ములాగా ఏర్పడి శ్వాసలోపం తీవ్రమవుతుంది.

4. రోజూవారీ కార్యాచరణ కష్టం అవుతుంది..

శ్వాసలోపం, అలసట కారణంగా, గుండె వైఫల్యం ఉన్న వ్యక్తులు తరచుగా శారీరక శ్రమలు, రోజువారీ కార్యకలాపాలు చేయడంలో ఇబ్బంది పడతారు.

5. అలసట..

గుండె ఆరోగ్యం క్షీణించినప్పుడు అసాధారణ రీతిలో అలసట భావన కలుగుతుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి గుండె సమర్థవంతంగా ఆక్సీజన్ ఉన్న రక్తాన్ని పంప్ చేయలేకపోవవడమే దీనికి కారణం

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top