*4.5 లక్షల మంది విద్యార్థులు.. 50వేల మంది టీచర్లు
*ఒక్కో ట్యాబ్ రూ.12,843... మొత్తం రూ.643 కోట్లు
ఎనిమిదో తరగతి విద్యా ర్థులకు ట్యాబ్ లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా.. ఎనిమిదో తరగతి ఉపాధ్యాయులకూ ట్యాబ్లు ఇవ్వాలని నిర్ణయించింది. విద్యార్థు లకు ట్యాబ్లో పాఠాలు చెప్పేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 4,50,540 మంది విద్యా ర్థులు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. వారికి 50,194 మంది ఉపా ధ్యాయలు పాఠాలు బోధిస్తున్నారని పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. అందరికీ శాంసంగ్ టీ220 లైట్ ట్యాబ్లు ఇచ్చేందుకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది. 64 జీబీ మెమొరీ సామర్థ్యముండే ఒక్కో ట్యాబ్ను రూ.12,843కు కొనుగోలు చేస్తున్నారు. విద్యార్థులు, టీచర్లకు కలిపి మొత్తం ట్యాబ్ల కోసం రూ.643 కోట్లు అవుతోంది. వీటిలో బైజూస్ కంటెంట్ నింపి విద్యార్థులకు ఇవ్వనున్నారు. కాగా.. టెండర్లు ఆలస్యం కావడంతో తొలుత సగం మందికి, తర్వాత మిగిలిన వారికి పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియ ముగిసేందుకు రెండు నెలలు పట్టనుంది. వాస్తవానికి అమ్మఒడికి బదులుగా 9, 10, ఇంటర్మీడి యట్ విద్యార్థులకు ల్యాప్ట్యాప్ లు ఇస్తామని గతంలో సీఎం జగన్ ప్రకటించారు. దీంతో సుమారు 8 లక్షల మంది అప్పట్లో ల్యాప్టాప్లు కావాలని ఆప్షన్లు ఇచ్చారు. తక్కువ ధరకు ల్యాప్టాప్లు కొనుగోలు చేయాలని భావించిన ప్రభుత్వానికి టెండర్లలో చుక్కెదురైంది. ప్రభుత్వం కోరిన ధరలకు ల్యాప్ట్యాప్లు ఇచ్చేందుకు ఏ కంపెనీ ఏ ముందుకు రాలేదు. దీంతో ల్యాప్ట్యాప్ ప్రక్రియ ఆగిపోయింది.
0 comments:
Post a Comment