ఈరోజు 22.10.22 విద్యా సంబంధిత వార్తలు

ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలి

నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషనల్ స్టేజ్ నివేదిక స్పష్టీకరణ

ప్రాథమిక విద్యాబోధన పిల్లల మాతృభాషలో లేదా, బాగా తెలిసిన భాషలో సాగడం ఉత్తమమని కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషనల్ స్టేజ్ నివేదిక వెల్లడించింది. చిన్నారులు తమ మాతృభాషలోనే విషయాలను వేగంగా సంగ్రహించి లోతుగా అర్థం చేసుకోగలు గుతారు కాబట్టి ఈ విధానమే ఉత్తమమని తెలి పింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు రెండింటిలోను ఇదే పద్ధతిని అనుసరించాలని పేర్కొంది. "పిల్లలు ప్రాథమిక విద్యాభ్యాసం మొదలు పెట్టినప్పుడు వారి మాతృభాష (ఎల్1)లో బోధన కొనసాగేలా చూడాలి. ఇందు కోసం సదరు భాషను బోధించడంతోపాటు వారి సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకోగ లిగిన స్థానిక టీచర్లను నియమించడం అత్యవ సరం. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన చేసే టీచర్లు పిల్లల మాతృభాషలో నిపుణులై ఉండాలి. చిన్నారులు విద్యాబోధనా ప్రక్రియలో తల్లిదండ్రులనూ భాగస్వాములను చేయాలి. విద్యార్థుల సంపూర్ణ వికాసానికి, అభ్యాసానికి ఇది చాలా ముఖ్యం" అని ఈ నివేదిక పేర్కొంది


ఏకరూప దుస్తుల కుట్టుకూలి పెంచుతున్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

జగనన్న విద్యాకానుక కింద ఇస్తున్న పుస్తకాలు బ్యాగుల్లో తొమ్మిది శాతం బాగాలేవని ప్రభుత్వ సర్వే లో తేలిందని, అందు వల్ల గుత్తేదారుకు బిల్లులు నిలిపివేశామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ పేర్కొన్నారు. విద్యార్థు లకు ఇచ్చే ఏకరూప దుస్తుల కుట్టు కూలిని పెంచుతున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం నాగళ్లవలసలో నిర్మించిన సచివా లయ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. స్థానిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కిచిడి, పులి హోర బాగోలేదని విద్యార్థులు చెప్ప డంతో దీన్ని మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సంక్రాంతి నుంచి పింఛను కానుక పెంచుతున్నా మని తెలిపారు.

నాలుగేళ్లు డిగ్రీలో ఎప్పుడైనా చదువు ఆపేసి.. వెళ్లిపోవచ్చు

 నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా నాలుగేళ్ల డిగ్రీలో విద్యార్థి ఎప్పుడైనా చదువు ఆపేసి, బయటకు వెళ్లి పోయే అవకాశాన్ని కల్పించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఉన్నత విద్యలో ప్రవేశాలను పెంచేందుకు ఈ విధానాన్ని తీసుకొ స్తున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన తర్వాత చదువు ఆపేసి, వెళ్లిపోవాలను కుంటే విద్యార్థి వెళ్లిపోవచ్చు. ఏడాది చదివినందుకు కొన్ని క్రెడిట్లు ఇచ్చి సర్టిఫికెట్ ప్రధానం చేస్తారు. ఒకవేళ మళ్లీ వచ్చి డిగ్రీ చదువుకోవచ్చు. లేదంటే ఈ క్రెడిట్లను బదిలీ చేసుకొని, డిప్లొమా గాని, ఇతర కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. డిగ్రీ రెండో సంవత్సరం పూర్తయిన తర్వాత మానేస్తే డిప్లొమా ఇస్తారు. మూడేళ్ల తర్వాత వెళ్లిపోతే డిగ్రీ, ఆ తర్వాత ఆనర్స్ డిగ్రీ ప్రదానం చేస్తారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న పాఠ్యప్రణాళి కలోనూ కొన్ని మార్పులు చేయనున్నారు. దీన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురావాలనే దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు.


ఆరేళ్ల వరకు బొమ్మలతోనే బోధన

ఎన్సిఎప్ ని విడుదల చేసిన ధర్మేంద్ర ప్రదాన్

మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసు గల పిల్లలకు పాఠ్యపుస్తకాలుండవు. బొమ్మల ఆధారంగానే బోధన ఉంటుంది. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల వయసు గల పిల్లల కోసం 360 పేజీల నూతన జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ (ఎన్సీఎఫ్)ని విడుదల చేశారు. ప్రాథమిక దశకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రిని జనవరి 2023 నాటికి ఈ ఫ్రేమ్వర్క్ ఆధారంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సిఇఆరి) తయారు చేస్తుంది. ఎన్సిఎఫ్కి అనుగుణంగా నర్సరీ నుండి రెండో తరగతి మధ్య చదువుతున్న పిల్లల కోసం పాఠశాలలు, ప్రీ-స్కూల్స్, అంగన్వాడీలు అనుసరించే అన్ని బోధనా విధానాలు ఉంటాయి. పాఠ్య ప్రణాళిక లక్ష్యాలు, భాషా విద్య, అక్షరాస్యత, గృహ ఆధారిత అభ్యాసం, బోధనా శైలులు, మూల్యాంకన పద్ధతులు ఉంటాయి. ఆరు నుంచి ఎనిమిదేళ్ల వయసు గల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు డిజిటల్, ఆడియో విజువల్ మెటీరియల్ రిఫరెన్స్లను సిఫార్సు చేసింది. పాఠ్యపుస్తకాల్లో ప్రాంతీయ వైవిధ్యాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఫ్రేమ్వర్క్ పేర్కొంది. తరగతి గదిలో అన్ని భాషలను తప్పనిసరిగా స్వాగతించాలని పేర్కొంటూనే, ప్రాథమిక దశలో పిల్లలు తమ "హోమ్ లాంగ్వేజెస్" (మాతభాషలలో తమ భావాలను వ్యక్తీకరించడానికి, పరస్పరం చర్చించుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రోత్సహించాలని ఎన్సిఎఫ్ పేర్కొంది. భౌతిక వికాసం (శారీరక్ వికాస్), జీవిత శక్తి అభివృద్ధి (ప్రాణిక్ వికాస్, భావోద్వేగ, మానసిక వికాసం (మానసిక్ వికాస్), మేధో వికాసం (బౌద్ధిక్ వికాస్), ఆధ్యాత్మిక వికాసం (చైత్సిక్ వికాస్)తో కూడిన విద్య కోసం పంచకోశ వ్యవస్థను ప్రస్తావించింది. సావిత్రీబాయి పూలే, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి విద్యా మార్గదర్శకులను కూడా బోధనలో పేర్కొంది.

టీచర్ల సమస్యలనుప రిష్కరించాలి.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సంఘాల వినతి

 ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్, బదిలీలు, డీఏలు, డీఏ బకాయిలు, ఎయిడెడ్ టీచర్ల సమస్యలు తదితర అంశా లను పరిష్కరించాలని వివిధ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహా దారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి విన్న వించారు. కృష్ణా గుంటూరు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, దాదాపు 20 సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు సజ్జలను కలిసి పలు సమస్యలపై చర్చించారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గిరిప్రసాద్ రెడ్డి, శ్రీధ ర్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిట్టిబాబు ఎల్కే చిన్నప్ప, ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొ న్నారు. పండుగల వేళ ఉపాధ్యాయులకు పెండింగ్ డీఏలు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్య క్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రెటరీ జనరల్ సామల సింహాచలం, మీడియా కన్వీనర్ గరికపాటి సురేష్ ప్రకటనలో డిమాండ్ చేశారు.

కిచిడీకి బదులు పప్పు పులుసు

మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు: బొత్స

 రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం మెనూలో స్వల్ప మార్పులు చేయనున్నట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కిచిడికి బదులుగా పప్పు పులుసు చేరుస్తున్నట్లు చెప్పారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం నాగళ్ల వలసలో గ్రామ సచివాలయం భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు తీరుపై ఆరా తీశారు. కొందరు విద్యార్థులను పిలిచి మధ్యాహ్న భోజనంలో ఇస్తున్న ఆహారం ఎలా ఉందని మంత్రి ప్రశ్నించారు. కిచిడి రుచికరంగా ఉండడం లేదని విద్యార్థులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కిచిడి రుచికరంగా ఉండడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డితో చర్చించి మెనూలో కిచిడికి ప్రత్యామ్నాయంగా పప్పు పులుసు చేర్చే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. విద్యా కానుకలో భాగంగా విద్యార్ధులకు సరఫరా చేసిన స్కూల్ బ్యాగులు కొన్ని చిరిగి పోయినట్లు ఫిర్యాదులు వచ్చాయని, వాటి స్థానంలో కొత్తవి సరఫరా చేస్తామని చెప్పారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top