Secunderabad: సికింద్రాబాద్ ఆర్డినెన్స్ కార్ప్స్ 419 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎంపికైతే రూ.92,300 వరకూ జీతం

Secunderabad AOC Recruitment 2022:సికింద్రాబాద్ లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో మెటీరియల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 419 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తి వివరాలకు https: //www.aocrecruitment.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు.

మెటీరియల్ అసిస్టెంట్: 419 పోస్టులు

రీజియన్ల వారీగా ఖాళీలు: ఈస్ట్రన్- 10, వెస్ట్రన్ 120, నార్తెర్న్- 23, సదరన్- 32, సౌత్ వెస్ట్రన్ 23, సెంట్రల్ వెస్ట్- 185, సెంట్రల్ ఈస్ట్- 26 పోస్టులున్నాయి.

అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా ఇంజినీరింగ్/ డిప్లొమా (మెటీరియల్ మేనేజ్మెంట్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: రూ.29,200 నుంచి రూ.92,300.

ఎంపిక ప్రక్రియ: శారీరక దారుఢ్యం/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.aocrecruitment.gov.in/

Download Complete Notification





Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top