WhatsApp: ఒక వాట్సాప్‌ గ్రూప్‌లో.. 1024 మంది!

 వాట్సాప్‌ (WhatsApp) మరో కీలక ఫీచర్‌లో కొత్త అప్‌డేట్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఒకేసారి ఎక్కువమందితో చాట్ చేసేందుకు, ముఖ్య సమాచారాన్ని ఇతరులకు తెలియజేసేందుకు గ్రూపులో సభ్యుల సంఖ్యను పెంచనుంది.గతంలో ఓ గ్రూపులో గరిష్ఠంగా 256 మంది సభ్యులుగా ఉండేందుకు అనుమతి ఉండేది. ఇటీవలే ఈ సంఖ్యను 512కు అప్‌డేట్ చేసింది. తాజాగా ఈ సంఖ్యను మరింత పెంచనుంది. ఒక గ్రూపులో 1,024 మంది ఉండేలా కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. దీంతో ఒకేసారి ఎక్కువ మందితో చాట్ చేయొచ్చు.


ప్రస్తుతం ఈ ఫీచర్‌ వాట్సాప్‌ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్లకు పూర్తిస్థాయిలో పరిచయం చేయనున్నట్లు సమాచారం. దీంతోపాటు, గ్రూపు అడ్మిన్‌ల కోసం కొత్త అప్రూవల్ సిస్టమ్‌ (Approval System) తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో అడ్మిన్‌ గ్రూపులో చేరేందుకు రిక్వెస్ట్‌ పంపిన వ్యక్తుల జాబితా పెండింగ్ పార్టిసిపెంట్స్‌ (Pending Participants) గా కనిపిస్తుంది. వారిలో ఎవరినైతే గ్రూపు సభ్యులుగా చేర్చుకోవాలనుకుంటున్నారో.. వారిని అనుమతిస్తే సరిపోతుంది. దీనివల్ల ఎక్కువమంది సభ్యులున్న గ్రూపుల నిర్వహణ సులువవుతుందనివాట్సాప్‌ భావిస్తోంది. 

ప్రైవసీ కోసం కొత్తగా...

వాట్సాప్‌ని యూజర్లకు మరింతగా చేరువ చేసేందుకు కాల్ లింక్స్‌, వాయిస్ స్టేటస్‌ వంటి ఫీచర్లనూ పరిచయం చేయనుంది. యూజర్‌ ప్రైవసీ కోసం వ్యూవన్స్‌లో స్క్రీన్‌షాట్‌ బ్లాక్ అనే మరో ముఖ్యమైన ఫీచర్‌ను తీసుకొస్తుంది. దీంతో యూజర్లు వ్యూవన్స్ ద్వారా పంపే మెసేజ్‌లను అవతలివారు స్క్రీన్‌షాట్‌ తీయలేరు. వాట్సాప్‌ కాల్‌ లింక్స్‌ ఫీచర్‌ జూమ్‌, గూగుల్ మీట్ తరహాలో పనిచేస్తుంది. వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలనుకునే వ్యక్తి కాల్‌ లింక్‌ క్రియేట్ చేసి పంపితే, ఇతరులు లింక్‌పై క్లిక్‌ చేసి వీడియో సమావేశంలో పాల్గొంటారు. వాయిస్‌ స్టేటస్‌లో యూజర్లు తమకు ఆడియో మెసేజ్‌లను వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top