ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) -బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరు తోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో స్టడీ సెంటర్లు ఉన్నాయి. ప్రతి స్టడీ సెంటర్లో 50 సీట్లు ఉన్నాయి. ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది.
ప్రోగ్రామ్ వివరాలు: ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు గరిష్టంగా అయిదే. ళ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్ మొత్తానికి 72 క్రెడిట్స్ నిర్దేశించారు, ప్రోగ్రామ్లో భాగంగా కోర్ కోర్సులు, ప్రాక్టికల్ కోర్సులు ఉంటాయి. వీటికి సంబంధించిన సెల్ఫ్ లెర్నింగ్ ప్రింట్ మెటీరియల్ తోపాటు స్టడీ మెటీరియల్, అసైన్మెంట్స్ను రిజిస్టర్ పోస్ట్ ద్వారా అభ్యర్థులకు పంపుతారు. ఆడియో/ వీడియో ప్రోగ్రామ్లు, కౌన్సె లింగ్ సెషన్స్ వర్క్స్లు, టర్మ్ ఎంట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహి స్తారు. మొదటి ఏడాది నాలుగు వారాలు ఇంటర్న్ షిప్, రెండో ఏడాది 16 వారాలు ఇంటర్న్ షిప్ పూర్తిచేయాల్సి ఉంటుంది..
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్సెస్/ సోషల్ సైన్సెస్/కామర్స్/ హ్యుమానిటీస్ విభాగాల్లో డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ద్వితీయ శ్రేణి మార్కులు తప్పనిసరి. కనీసం 55 శాతం. మార్కులతో బీఈ/ బీటెక్ పూర్తిచేసినవారు కూడా అర్హులే ఎలిమెం టరీ ఎడ్యుకేషన్లో ట్రెయినింగ్ పొంది టీచర్ గా పనిచేస్తూ ఉండాలి. లేదంటే ఎన్సీటీఈ గుర్తింపు పొందిన టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రా మ ను ఫేస్ టు ఫేస్ మోడ్లో పూర్తిచేసి ఉండాలి.
ప్రోగ్రామ్ ఫీజు: రూ.55,000
* దరఖాస్తు ఫీజు: రూ.1000
* దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 20
• ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ: 2023 జనవరి 8
• వెబ్సైట్: www.ignou.ac.in
0 comments:
Post a Comment