CRPF recruitment 2022: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 1458 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. వీటిలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 1458 పోస్టుల్లో.. 143 పోస్టులు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ స్టెనో ర్యాంకు గల పోస్టులు. మిగిలినవి 1315 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ప్రక్రియ 2023, జనవరి 4 నుంచి ప్రారంభం కానుంది. అప్లికేషన్ల సమర్పణకు గడువు జనవరి 25గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు http://crpf.gov.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం:
అర్హత: అభ్యర్థులు ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థుల వయస్సు జనవరి 25, 2023 నాటికి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనాలు : అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టు వేతనాల పే లెవెల్ 5గా నిర్దేశించారు. దీని కింద వేతనం రూ. 92,300 వరకు లభిస్తుంది. హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులకు వేతనం రూ. 81,100 వరకు లభిస్తుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://crpf.gov.in/


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment