డిగ్రీకి రూ.2 లక్షలు, పీజీకి రూ.6 లక్షలు స్కాలర్ షిప్ పొందే అవకాశం!

ప్రతిభ ఉన్నా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్న విద్యార్థులు దేశంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారిని ప్రోత్సహించడానికి రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. వచ్చే పదేళ్లలో 50,000 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించనుంది. అందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5100 స్కాలర్‌షిప్‌ల అందించబోతున్నారు. ఇందులో 5000 స్కాల‌ర్‌షిప్స్‌ అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల‌కు కాగా, 100 స్కాల‌ర్‌షిప్స్‌ పీజీ విద్యార్థుల‌కు ఇవ్వనున్నారు. 

ఈ స్కాల‌ర్‌షిప్స్‌ పొందడానికి అర్హతలేంటి..? ఎలా అప్లై చేయాలి..? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..



డిగ్రీ, పీజీ వంటి పైచదువులు చదవాలనుకున్న విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్స్ పొందడానికి అర్హులు. ఎంపికైనవారికి కోర్సు వ్యవధి అంతా ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. పరీక్షలో చూపిన ప్రతిభ, అకడమిక్ నేపథ్యం, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్స్‌ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. విద్యార్థులు ఫిబ్రవరి 14 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిభగల విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు ఈ స్కాలర్‌షిప్ చక్కగా ఉపయోగపడుతుంది.

డిగ్రీ స్థాయిలో రూ. 2 లక్షలు

అర్హతలు:

ఇంటర్‌ పూర్తి చేసిన వారు లేదా డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నవారు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్‌ లేదా ప్లస్‌-2లో 60 శాతం మార్కులతో  ఉతీర్ణులై ఉండాలి.

తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.15 లక్షల లోపు ఉండాలి. అయితే రూ.2.5 లక్షల లోపు ఉన్న వారికి ప్రాధాన్యమిస్తారు.

విద్యార్థినులు, దివ్యాంగులకు అధిక ప్రాధాన్యమిస్తారు.

కావాల్సిన డాక్యుమెంట్స్:

ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, అడ్రస్ ప్రూఫ్‌, 10, 12 తరగతుల బోర్డు ఎగ్జామ్ మార్క్స్ షీట్‌తో పాటు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి బోనఫైడ్‌ సర్టిఫికెట్ ఉండాలి. వీటితో పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం(ఇన్‌కమ్‌ ప్రూఫ్‌) సమర్పించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:

మెరిట్ ప్రాతిపదికన మరియు ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్టు ఆధారంగా ఎంపిక ఉంటుంది. అర్హులకు ఫ్రీగా ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్‌ టెస్టు నిర్వహిస్తారు. వెర్బల్, ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్, న్యూమరికల్‌ ఎబిలిటీ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 20చొప్పున మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. 60 నిమిషాల సమయం ఉంటుంది. ఆప్టిట్యూడ్‌ టెస్టు స్కోరు, అకడమిక్, పర్సనల్‌ సమాచారం ఆధారంగా అర్హులను ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను మార్చిలో ప్రకటిస్తారు. మొత్తం 5 వేల మందికి స్కాలర్‌షిప్స్‌ను మంజూరు చేయనున్నారు.

రూ. 2 లక్షల స్కాలర్‌షిప్:

ఎంపికైనవారికి డిగ్రీ పూర్తయ్యేలోపు సుమారు రూ.2 లక్షల వరకుఆర్థిక ప్రోత్సాహం పొందవచ్చు. అలాగే.. వీరికి రిలయన్స్ ఫౌండేషన్ నుంచి కెరియర్ పరంగానూ సహకారమూ లభిస్తుంది. అంటే, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, వర్క్ షాపులు, పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌తో అనుసంధానం మొదలైనవి ఉంటాయి.

పీజీ స్థాయిలో రూ. 6 లక్షలు

అర్హతలు:

పీజీ మొదటి ఏడాది కోర్సు చదువుతున్న వారు ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవచ్చు.

గేట్‌లో 550-1000 మధ్య స్కోర్, లేదా యూజీలో 7.5 సీజీపీఏ ఉత్తీర్ణత ఉండాలి.

దేశంలో ఏదేని ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్, రెన్యూవబుల్ అండ్ న్యూ ఎనర్జీ, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, లైఫ్ సైన్సెస్ కోర్సులు చదువుతున్నవారు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు రిలయన్స్‌ ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌లో ఎలిజిబిలిటీ క్వశ్చనీర్‌ను పూర్తిచేయాలి. పర్సనల్, అకడమిక్, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ వివరాలు నమోదు చేసుకోవాలి. రెండు రిఫరెన్స్‌ లెటర్లు జతచేయాలి. వీటిలో ఒకటి అకడమిక్‌ నైపుణ్యాలు, రెండోది వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు తెలిపేదై ఉండాలి. రెండు ఎస్సేలు ఒకటి పర్సనల్‌ స్టేట్‌మెంట్, రెండోది స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ రాసివ్వాలి. దరఖాస్తుల పరిశీలనలో నిలిచినవారికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్, వెబినార్లు ఉంటాయి. ఇందులో ఎంపికైన వంద మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తారు

రూ. 6 లక్షల స్కాలర్‌షిప్:

కోర్సు వ్యవధికి మొత్తం రూ.6 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందులో 80 శాతం విద్యా సంవత్సరం ప్రారంభంలో, మిగతా 20 శాతం ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్, కాన్ఫరెన్సులు, పర్సనల్ డెవలప్‌మెంట్… తదితర ఖర్చుల కోసం చెల్లిస్తారు.

గమనిక: అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు ‘స్కాలర్‌షిప్స్‌.రిలయన్స్‌ఫౌండేషన్‌‘ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Apply Click Here

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top