CISF Recruitment: CISFలో 451 ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..

ఉన్నత చదువులుచదివిన వారికి కూడా ఉద్యోగ అవకాశాలు(Jobs) తక్కువగా లభిస్తున్నాయి. చాలా మంది నిరుద్యోగులు అవకాశాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో టెన్త్ పాసైన నిరుద్యోగులకుసెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) గుడ్ న్యూస్ చెప్పింది.తాజాగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి (CISF Recruitment) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cisfrectt.inద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ నేటి (జనవరి 23) నుంచి ప్రారంభం అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఫిబ్రవరి 22 చివరి తేదీగా గుర్తుంచుకోవాలి. ఈ లోపే దరఖాస్తులు సమర్పించాలి. 

ఖాళీల వివరాలిలా..

మొత్తం 451 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది. వీటిలో 183 ఖాళీలు కానిస్టేబుల్/డ్రైవర్ మరియు 268 ఖాళీలు కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. 

అర్హత ప్రమాణాలు

ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా అందుకు సమానమైన కోర్సులో ఉత్తీర్ణత ఉండాలి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

దరఖాస్తు విధానం

- ముందుగా సీఐఎస్‌ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ cisfrectt.in ను సందర్శించాలి. 

-హోమ్‌పేజీలో లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆపై కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్-2022 లింక్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్, టెక్స్‌ట్ ఇమేజ్‌ను ఎంటర్ చేయాలి. అవసరమైన అన్ని వివరాలతో అప్లికేషన్‌ను పూర్తి చేసి, తర్వాత పేమెంట్ చేయాలి. 

UR, OBC, EWS కేటగిరి అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), మాజీ సైనికుల (ESM) కేటగిరికి చెందిన అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. చివరగా అప్లికేషన్ సాప్ట్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవాలి. 

ఎంపిక ప్రక్రియ

ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ వంటి మల్టి-లెవల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700నుంచి రూ.69,100 వరకు జీతం లభిస్తుంది. , 2004 జనవరి 1న లేదా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో చేరిన ఉద్యోగులందరికీ వర్తించే "నేషనల్ పెన్షన్ సిస్టమ్‌గా పేర్కొనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ పెన్షనరీ ప్రయోజనాలు అందుతాయి.



Indian Army : ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశాలు

వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/Hu5S9VkL2QLGy9hznC8u9F

Telegram Group: https://t.me/apjobs9

Online Application Click Here

Download Complete Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top