అధికారుల ఆకస్మిక విజిట్స్ సందర్భంగా ఉపాధ్యాయులకు, HMs లకు ముఖ్యమైన సూచనలు... వీటిని క్రమం తప్పకుండా పాటించండి.

CSE శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారి ఆదేశాలను అనుసరించి సోమవారం నుంచి గౌ౹౹ డీఈవోలు , గౌ౹౹ఎంఈఓ లు మరియు జిల్లా/మండల  బృందాలు మీ మీ పాఠశాలను సందర్శించే అవకాశం ఉన్నది.

అధికారుల ఆకస్మిక విజిట్స్ సందర్భంగా ఉపాధ్యాయులకు, HMs లకు ముఖ్యమైన  సూచనలు... వీటిని క్రమం తప్పకుండా పాటించండి.

(1) పాఠశాలకు సమయానికి  వెళ్లడం. ఉదయం, సాయంత్రం ఫేషియల్ అటెండెన్స్ నమోదు చేయడం.

(2) ప్రతిరోజు అసెంబ్లీని అకడమిక్ క్యాలెండర్ ప్రకారం నిర్వహించడం.

(3) స్టూడెంట్స్ అటెండెన్స్, ఎండిఎం ఫోటోలు, టాయిలెట్స్ ఫోటోలు, ఇన్ టైంలో ఫేషియల్ అటెండెన్స్ అన్నీ యాప్స్ లో  చెయ్యడం.

(4) టీచింగ్ నోట్స్ రాయడం.

(5) Year plans, Lesson plans update గా రాయడం.

(6) నోట్స్ కరెక్షన్, Work books కరెక్షన్ చేయడం.

(7) అన్ని రకాల పరీక్షా పత్రాలు correction చేసి ఉండడం . ప్రిన్సిపుల్స్ ఆఫ్ వాల్యుయేషన్ వ్రాసి ఉంచడం.

(8) మార్కులను ఆన్లైన్ లో నమోదు చేయడం, పర్సనల్ మార్క్స్ రిజిస్టర్ లో  నమోదు చేసి సిద్ధం చేయడం.

(9) అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్ కంప్లీట్ చెయ్యడం.

(10) MDM  మెనూ ప్రకారం అమలు చేయడం ,  సంబంధిత రైస్, ఎగ్స్, చిక్కీల కు సంబంధించి రిజిస్టర్ల సక్రమ నిర్వహణ, ఫుడ్ టెస్టింగ్ కమిటీ ప్రతిరోజు తనిఖీ చేసే రిజిస్టర్ ఉండాలి.

(11) మరుగుదొడ్లతోపాటు, ఎండిఎం పరిసరాలు, పాఠశాల పరిశుభ్రoగా ఉంచడం.

(12)C L , ODs రిజిస్టర్ల అప్డేషన్ తో సక్రమ నిర్వహణ

(13) ఫార్మేటివ్ అసెస్మెంట్ నోట్ బుక్స్, ఎగ్జామ్స్ పేపర్స్ భద్రపరచడం.

(14) టాయిలెట్ క్లీనింగ్ మెటీరియల్ స్టాక్ రిజిస్టర్,

(15) విద్యార్థినిల శానిటరీ‌ నాప్కిన్స్ స్టాక్ రిజిస్టర్

(16)నాడు, నేడు పనుల all UCs, స్టాక్ Register

(17) Roll particulers క్లాస్ వైస్, క్యాస్ట్ వైస్

(18) School time టేబుల్ టీచర్ వైస్, క్లాసువైస్ ,

(19) CCE grading రిజిస్టర్

(20) కనీసం గత మూడు సంవత్సరాల ఎస్ ఎస్ సి ఫలితాల పర్టికులర్స్

(21) ఆర్వో సిస్టం మరియు drinking వాటర్ check చెయడం.

(22) విద్యార్థులు అందరూ యూనిఫామ్, షూస్ ధరించేటట్లు చూడడం,జగనన్న స్కూల్ బ్యాగ్ తో విద్యార్థులు ఉండడం.

(23) తరగతి గది శుభ్రంగా ఉండడం మరియు TLM తో తరగతిగది ఉండడం.

(24) నాడు నేడు పాఠశాలలో లైటులు, ఫ్యానులు కండీషన్ లో ఉండడం.

(25) ఆయా అటెండెన్స్ రిజిస్టర్ 

(26)PC సమావేశాలు నిర్వహించి తీర్మానాలు నమోదుచేయాలి. రిజిష్టర్  సరిచూసుకోవాలి.

(27) ముఖ్యంగా విద్యార్థులందరూ మధ్యాహ్నం భోజనం తినే విధంగా చూడాలి. విద్యార్థులు ఇంటి నుండి అన్నం క్యారీలో తెచ్చుకుని పాఠశాలలో భోంచేసే దానిని నిషేధించాలి. ఒక్కొక్క విద్యార్థికి రైసు ఎంత మోతాదులో ఇవ్వాలి, కూరగాయలు, నూనె, ఉప్పు, కారంల గురించి అవగాహన కలిగి ఉండాలి.

(28) మధ్యాహ్నం భోజనాన్ని కట్టెలు ఉపయోగించి చేయరాదు... గ్యాస్ ను తప్పనిసరిగా ఉపయోగించాలి.

(29) లర్న్ ఏ వర్డ్ ఏ డే రిజిస్టర్

(30) లాంగ్వేజ్ ఇంప్రూమెంట్ ప్రోగ్రాం(లిప్) పై పూర్తి అవగాహన మరియు సంబంధిత రిజిస్టర్లు నిర్వహణ

(31) పాఠశాలకు మంజూరైన నిధుల వివరాలు

(32) క్లాస్ వైస్ విద్యార్థుల డ్రాప్ అవుట్ వివరాలు కారణాలు

(33) వైయస్సార్ కంటి వెలుగు విద్యార్థుల వివరాలు

(34) సి డబ్ల్యూ ఎస్ ఎన్ విద్యార్థుల వివరాలు

(35) ఇయర్ వైస్ అమ్మ ఒడి విద్యార్థుల వివరాలు. సంఖ్య

(36) విద్యార్థులకు ఇచ్చిన TABS వివరాలు

(37) విద్యార్థులకు ఇచ్చిన టెక్స్ట్ బుక్స్ వివరాలు

(38) కరోనాకాలంలో విద్యార్థులకు అందించిన డ్రైనేషన్, కందిపప్పు వివరాలు

(39) విద్యార్థులకు అందించిన అన్నం తినే ప్లేట్స్ వివరాలు

(40) మనం తీసుకునే బియ్యపు బస్తాలకు గ్రీన్ కలర్ లేబుల్ ఉందా లేదా అని సరిచూసుకోనవలెను. గ్రీన్ కలర్ లేబుల్ ఉంటే అవి ఫోర్టిఫైడ్ రైసు కలిపిన బస్తా అని అర్థం... 

పాఠశాలకు సంబంధించి పై విషయాల యందు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అవగాహన కలిగి ఉండాలి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top